హైదరాబాద్‌లో ఎన్ఐఏ సోదాలు
హైదరాబాద్: జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు ఆదివారం హైదరాబాద్ నగరంలో తనిఖీలు చేపట్టారు. సైదాబాద్ శంఖేశ్వర్ బజార్ గ్రీన్ వ్యూ అపార్ట్‌మెంట్‌లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు గంటపాటు సోదాలు నిర్వహించనట్లు తెలిసింది. ఈ ఏడాది ఆగస్టులో ఉగ్రవాది రిజ్వాన్ అబ్దుల్‌ను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. అతడ్ని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా గుర్తించింది.
రిజ్వాన్ అబ్దుల్ ఐసిస్ తరఫున పుణె నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడని తేలింది. రిజ్వాన్ ను ఢిల్లీలోని గంగాబక్ష్ మార్గ్ వద్ద ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో రిజ్వాన్ నుంచి 30 బోర్ పిస్టల్, 3 కాట్రిడ్జ్‌లు, రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత రిజ్వాన్‌పై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇప్పటికే రిజ్వాన్ తలపై రూ.3 లక్షల రివార్డు ఉంది. అరెస్టు అనంతరం ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టింది. రిజ్వాన్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. సైదాబాద్ శంఖేశ్వర్ గ్రీన్ వ్యూ అపార్ట్‌మెంట్‌లో రిజ్వాన్ కొద్దినెలలు ఉన్నాడని ఎన్‌ఐఏ విచారణలో తేలింది.
ఈ క్రమంలో రిజ్వాన్‌ను తీసుకొని వచ్చి సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మిరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గతంలో కూడా ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ నగరంలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులతో సంబంధం ఉన్న వ్యక్తుల కోసం గాలింపు చేపట్టారు.












Click it and Unblock the Notifications