'లిక్కర్ రాణి' అని పేరు తెచ్చుకోలే.. కవితపై నిరంజన్ రెడ్డి ఫైర్ !!
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తాను "అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లిన వ్యక్తి కాదని.. "లిక్కర్ రాణి" అనే పేరును తెచ్చుకున్న వ్యక్తిని కాదని వ్యాఖ్యానించారు. కవిత వల్ల రాష్ట్ర మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. గత ఎన్నికల ముందు కవిత కారణంగా తాము ప్రజల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నామని నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఏ ప్రాంతానికి వెళ్లినా ఆ ప్రశ్నలే ఎదురయ్యాయని... తమ పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కవిత చేసిన ఆరోపణలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా అని తెలిపారు.
ప్రభుత్వంపై కాకుండా స్వంత పార్టీయే లక్ష్యమా?
కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా ప్రజా సమస్యలపై కవిత నోరు విప్పకుండా.. బీఆర్ఎస్ నాయకులపై మాత్రమే విమర్శలు చేయడం ఏ ఉద్దేశ్యంతోనో చెప్పాలని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌పై సుతిమెత్తగా.. తమ పార్టీ నేతలపై ఘాటుగా మాట్లాడటం... ఎవరి మెప్పుకోసం?" అని నిలదీశారు. సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి వంటి సీనియర్ నేతలపై కవిత చేస్తున్న ఆరోపణలు పార్టీ బలం దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన అన్నారు.

కవిత తాను చేసిన ఆరోపణలను నిరూపించగలిగితే ముందుకు రావాలని సవాల్ విసిరారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎవరి మీదా కక్షపూరితంగా కేసులు పెట్టించలేదని స్పష్టం చేశారు. బీసీ వర్గాలపై తాను కేసులు పెట్టించానని చెబితే, ఆ జాబితాను మీడియా ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. తాను "హరీశ్ రావు మనిషి" అని ప్రచారం చేయడం అసత్యమని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను వంద శాతం కేసీఆర్ మనిషినే... ఆయన ఆదేశాలే నాకు ధర్మం అని ప్రకటించారు. పార్టీ అధినాయకుడి కుమార్తె అయినప్పటికీ కవిత తప్పులు చేస్తే కూడా తాను ఎప్పుడూ పబ్లిక్‌గా మాట్లాడలేదని.. కేసీఆర్‌కు మానసిక క్షోభ కలగకుండా చూసానని అన్నారు.
తహసీల్దార్ కార్యాలయం ఘటనపై స్పందన..
తహసీల్దార్ కార్యాలయానికి నిప్పుపెట్టిన ఘటనలో తన పాత్ర ఉండేదని చేసిన ఆరోపణలను నిరంజన్‌రెడ్డి కొట్టిపారేశారు. ఒక కార్యాలయంలో రికార్డులు కాలిపోతే... ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల్లో ఉన్న దస్త్రాలు ఎలా మారిపోతాయి? అలాంటి అవివేకపు మాటలు మానుకోవాలని కవితను విమర్శించారు.
తెలంగాణ జాగృతి పేరుతో కవిత చేసిన వ్యాఖ్యలపై కూడా నిరంజన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఆమె ఆడకుంటే బతుకమ్మే లేదన్నట్టు మాట్లాడటం... తెలంగాణ సాంప్రదాయాలను తనిఖీ చేసుకునే స్థాయిలో కవిత వ్యాఖ్యానించడం ప్రజల మనోభావాలను అవమానించినట్లే అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. కవిత తండ్రి వయసున్న తనపై మాట్లాడటం ఎవరికి లాభం చేకూర్చేందుకని ప్రశ్నించిన నిరంజన్‌రెడ్డి.. కొన్ని డూప్లికేట్ కాంగ్రెస్ నేతలు రాసిన స్క్రిప్ట్‌ను చదువుతున్నట్టుందని వ్యాఖ్యానించారు.
వ్యక్తిగత దూషణలు, సంస్కారం లేని భాష రాజకీయాల్లో అనుచితమని హెచ్చరించారు. వనపర్తి నియోజకవర్గంలో తాను లక్షా 25 వేల ఎకరాలకు సాగునీరు అందించానని, అందుకే ప్రజలు ప్రేమగా 'నీళ్ల నిరంజన్ రెడ్డి'గా పిలుస్తారని గుర్తుచేశారు. ప్రజల కోసం చేసిన పనులే తన అసలైన బలం అని, కవితలాంటివారి విమర్శలు తనను దెబ్బతీయలేవని స్పష్టం చేశారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications