ఘోర ప్రమాదం-20 మీ. ఎగిరి చెట్టు కొమ్మకు చిక్కుకుని-వేలాడుతూనే మృతి

నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై బుధవారం(జూన్ 9) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మల్ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న ఓ కారు అతివేగంతో ఓ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తి అమాంతం 20 మీ. దూరం ఎగిరిపడి 12 అడుగుల ఎత్తున్న చెట్టు కొమ్మకు చిక్కుకున్నాడు. తలకు తీవ్ర గాయాలతో చెట్టు కొమ్మకు వేలాడుతూనే ప్రాణాలు వదిలాడు.

వివరాల్లోకి వెళ్తే... ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలం నీలగొండి (హస్నాపూర్‌)కి చెందిన సోయం మాన్కు(25) స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మాన్కు భార్య సోయం జంగుబాయికి కాలు విరగడంతో కొన్నాళ్లుగా నచ్చెన్ ఎల్లాపూర్‌లోని పుట్టింటి వద్ద ఉంటోంది.

nirmal speeding car hits bike man thrown in air died

ఇదే క్రమంలో భార్యను చూసేందుకు బుధవారం(జూన్ 9) మాన్కు నిర్మల్ జిల్లా కడెం మండలంలో ఉన్న నచ్చెన్ ఎల్లాపూర్‌కు బైక్‌పై బయలుదేరాడు. మాన్కు దోస్త్ నగర్ సమీపంలోని అటవీ ప్రాంతం మీదుగా వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు బైక్‌ను ఢీకొట్టింది. కారు అతివేగంతో ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న మాన్కు 20 మీటర్ల దూరం ఎగిరి... రోడ్డు పక్కన ఉన్న 12 అడుగుల ఎత్తయిన చెట్టు కొమ్మకు చిక్కుకున్నాడు.

తలకు తీవ్రగాయాలు కావడంతో చెట్టుకు వేలాడుతూనే ప్రాణాలు వదిలాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దించి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మాన్కు బైక్ పూర్తిగా దెబ్బతినగా... కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. నిర్మల్ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న కారు రాంగ్ రూట్‌లో రావడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు తెలుస్తోంది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

nirmal speeding car hits bike man thrown in air died

కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. భార్య సోయం జంగుబాయికి కాలు విరగడంతో పుట్టింటి వద్ద ఉన్న ఆమెను చూడటానికి నిర్మల్‌ జిల్లా కడెం మండలం నచ్చెన్‌ ఎల్లాపూర్‌కు బైక్‌పై బయల్దేరాడు. దోస్త్‌నగర్‌ సమీపంలోని అటవీ ప్రాంతానికి రాగానే నిర్మల్‌ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న కారు ఎదురుగా వచ్చి వేగంగా బైకును ఢీకొట్టింది. దీంతో మాన్కు ఎగిరి పడ్డాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+