సిటీలో మరో ఫ్లైఓవర్! హైదరాబాద్-విజయవాడ 6 లైన్ల రహదారి

రోడ్లు అభివృద్ధి చెందినప్పుడే పెట్టుబడులు వస్తాయన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రహదారుల అనుసంధానం అన్నింటికంటే ముఖ్యమైనదని.. అందుకే వాజ్‌పేయీ హయాంలో ఎన్డీఏ ప్రభుత్వం 'స్వర్ణ చతుర్భుజి' పథకాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దాన్ని నిలిపివేసిందన్నారు. రోడ్ల నిర్మాణంపై రూ. లక్షల కోట్లు ఎందుకని ఆనాడు విమర్శించారని మండిపడ్డారు.

2014లో తెలంగాణలో 2500 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉండేవని.. పదేళ్ల తర్వాత అవి 5200 కిలోమీటర్లకు చేరుకున్నాయన్నారు. ఈ విస్తరణ తెలంగాణలోని 32 జిల్లా కేంద్రాల గుండా జాతీయ రహదారుల అనుసంధానికి తోడ్పడిందని తెలిపారు.

Nitin Gadkari to launch several development programs in Telangana on May 5 Kishan Reddy

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్ల నిర్మాణం వేగవంతమైందని కిషన్ రెడ్డి తెలిపారు. గత పదేళ్లుగా జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు.

తెలంగాణలో రింగ్ రోడ్ల అభివృద్ధి జరుగుతోందని కిషన్ రెడ్డి తెలిపారు. అనుసంధానం కోసం మోడీ ప్రభుత్వం ఎక్కువ నిధులు ఖర్చు పెడుతోందన్నారు. తెలంగాణకు సంబంధించి 5 ప్రధాన కారిడార్ల నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. మే 5న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణకు వస్తున్నారన్నారు. రూ. 5416 కోట్లతో 26 ప్రాజెక్టుకలు ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలు జరుగనున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్, హైదరాబాద్‌లో నిర్వహించనున్న కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. అంబర్‌పేట ఫ్లైఓవర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.

పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్న అన్ని ప్రాంతాలకు రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్-శ్రీశైలం మధ్య ప్రయాణ సమయం తగ్గించేలా రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. హైదరాబాద్-విజయవాడ మధ్య ఆరులైన్ల రహదారికి యత్నిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో కొన్ని చోట్ల భూసేకరణ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. భూసేకరణ ఆలస్యమైతే.. నిర్మాణం కూడా ఆలస్యమవుతుందన్నారు. ఎంత త్వరగా భూమి సేకరించబడితే.. అంత త్వరగా రహదారుల నిర్మాణం పూర్తవుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+