Nizamabad: ఒకే సభా వేదికపై ఆ ఇద్దరు ప్రత్యర్థులు.. ఎందుకంటే..!
నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఒకే వేదికపై కనిపించారు. నిజామాబాద్ లో ఆదివారం బసవగార్డెన్ లో పద్మశాలి సంఘం కొత్త కార్యవర్గం ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ వచ్చారు. ఒకే వేదికపై వారు ఇద్దురు కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.
కుల సంఘాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వారు వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక కాంగ్రెస్ ఇంకా మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ పై కాంగ్రెస్ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అటు బీఆర్ఎస్ కూడా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మే 13 తెలంగాణ లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4 ఫలితాలు విడుదల కానున్నాయి.

ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వే ప్రకారం తెలంగాణలో కాంగ్రస్ ఎక్కువ సీట్లు గెలుస్తుందని చెబుతున్నారు. ఇక అసెంబ్లీ ప్రధాన పక్షంగా ఉన్న బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోనున్నట్లు సర్వే అంచనా వేస్తోంది. బీఆర్ఎస్ 2019 లోక్ సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో 9 సీట్లు గెలుచుకోగా.. ఈ ఎన్నికల్లో 2 సీట్లు సాధించే అవకాశం ఉందని సర్వే సంస్థ తెలిపింది. బీజేపీ గతం కంటే కాస్త పుంజుకుంటుందని పేర్కొంది.
తెలంగాణలో బీజేపీ 5 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉందని సర్వే సంస్థ అంచనా వేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications