గల్ఫ్‌కు వెళ్లొద్దు, ఇక్కడే ఉపాధి: కరీంనగర్ జిల్లా వాసులతో కవిత (ఫోటోలు)
హైదరాబాద్: అరచేతిలో వైకుంఠం చూపే గల్ఫ్ ఏజెంట్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కరీంనగర్ జిల్లా వాసులకు సూచించారు. బుధవారం ఆమె కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. నియోజక వర్గ పర్యటనలో భాగంగా పెంబట్లలో దుబ్బ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం 'మన ఊరు - మన ఎంపీ' కార్యక్రమంలో భాగంగా సారంగపూర్ మండలం రేచపల్లిలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు పార్లమెంట్లో లేవనెత్తుతున్నామని చెప్పారు. ఏడాదిలోనే రూ. 140 కోట్ల నిధులను కేంద్రం నుంచి తీసుకొచ్చామని తెలిపారు. గ్రామాల్లోనే ప్రజలకు మెరుగైన ఉపాధిని చూపిస్తామని అన్నారు.
అరచేతిలో వైకుంఠం చూపే గల్ఫ్ ఏజెంట్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలని కరీంనగర్ జిల్లా వాసులకు సూచించారు. ఏజెంట్ల మాయమాటలు నమ్మి గుడ్డిగా గల్ఫ్ విమానాలు ఎక్కొద్దని, అలాగే ఏజెంట్ల మాయలపై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నిర్ణీత జనాభా ఉన్న గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. కవిత సమక్షంలో వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు.

గల్ఫ్‌కు వెళ్లొద్దు, ఇక్కడే ఉపాధి: కరీంనగర్ జిల్లా వాసులతో కవిత
అరచేతిలో వైకుంఠం చూపే గల్ఫ్ ఏజెంట్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కరీంనగర్ జిల్లా వాసులకు సూచించారు. బుధవారం ఆమె కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు.

గల్ఫ్‌కు వెళ్లొద్దు, ఇక్కడే ఉపాధి: కరీంనగర్ జిల్లా వాసులతో కవిత
నియోజక వర్గ పర్యటనలో భాగంగా పెంబట్లలో దుబ్బ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 'మన ఊరు - మన ఎంపీ' కార్యక్రమంలో భాగంగా సారంగపూర్ మండలం రేచపల్లిలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.

గల్ఫ్‌కు వెళ్లొద్దు, ఇక్కడే ఉపాధి: కరీంనగర్ జిల్లా వాసులతో కవిత
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు పార్లమెంట్లో లేవనెత్తుతున్నామని చెప్పారు. ఏడాదిలోనే రూ. 140 కోట్ల నిధులను కేంద్రం నుంచి తీసుకొచ్చామని తెలిపారు. గ్రామాల్లోనే ప్రజలకు మెరుగైన ఉపాధిని చూపిస్తామని అన్నారు.

గల్ఫ్‌కు వెళ్లొద్దు, ఇక్కడే ఉపాధి: కరీంనగర్ జిల్లా వాసులతో కవిత
అరచేతిలో వైకుంఠం చూపే గల్ఫ్ ఏజెంట్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలని కరీంనగర్ జిల్లా వాసులకు సూచించారు. ఏజెంట్ల మాయమాటలు నమ్మి గుడ్డిగా గల్ఫ్ విమానాలు ఎక్కొద్దని, అలాగే ఏజెంట్ల మాయలపై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నిర్ణీత జనాభా ఉన్న గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications