భార్యకు సినిమాల్లో అవకాశాల్లేక, అలా కోట్లు దోచారు
హైదరాబాద్: గొలుసుకట్టు మోసాల కేసులో పరారీలో ఉన్న సురేఖ అనే మహిళ తొలుత సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాదుకు వచ్చింది. సినిమాల కార్యాలయాల చుట్టూ తిరిగింది. బుల్లి తెరపైన తనను తాను చూసుకోవాలని ఆరాటపడింది. అవకాశం దొరకక పోవడంతో డబ్బు సంపాదిస్తే గానీ తాము అనుకున్న పని సాధ్యం కాదని భావించింది.
పెట్టుబడి పెడితే అధిక కమిషన్
పెట్టుబడి పెడితే ఎక్కువ కమిషన్ ఇస్తామని చెప్పి భార్య సురేఖ, ఆమె భర్త శ్రీనివాస రావులు పలువురి నుండి కోట్ల రూపాయలు వసూలు చేశారు. వీరి బాధితుల సంఖ్య చాలానే ఉందని తెలుస్తుంది. నిందితులు తమకు సినిమా అవకాశాలు రాకపోవడంతో మోసాల వైపు మళ్లారని సమాచారం.

ఈ కేసులో భరత్ శ్రీనివాస రావును బంజారాహిల్స్ పోలీసులు రిమాండుకు పంపించారు. భార్య సురేఖ మాత్రం పరారీలో ఉంది. సురేఖ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది. కానీ ఫలించలేదు. దీంతో భార్యాభర్తలు ఇద్దరు కలిసి గొలుసుకట్టు వ్యాపారానికి తెరతీశారని తెలుస్తోంది.
సురేఖకు సంబంధించిన కొన్ని చిత్రాలను పోలీసులు బాధితులకు అందించారు. మోసపోయిన వారిలో ఓ ప్రయివేటు సంస్థ మేనేజర్‌తో పాటు, ఓ వైద్యుడు మరికొందరు ఉన్నారు. సురేఖ, శ్రీనివాస రావు దంపతులు దాదాపు రూ.10 కోట్ల మేర వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది. వారు గ్రీన్ వాల్ట్ గ్లోబ్ సంస్థ పేరుతో ఈ అక్రమాలకు పాల్పడ్డారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications