తెలంగాణలో పొత్తులపై తేల్చేసిన అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పొత్తులపై తేల్చేశారు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. తెలంగాణలో ఏ పార్టీలతోనూ తమకు ఎలాంటి పొత్తు లేదని హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నామని ఓవైసీ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలతో దేశానికి ఒరిగేదేమీ లేదన్నారు.
కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (CAA) రాజ్యాంగానికి విరుద్ధమని అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టం సమానత్వ హక్కుకు విరుద్ధమని, ఈ చట్టాన్ని తాను ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్లోని పీడీఎం(PDM) కూటమి ఏర్పాటు చేశామని, తమ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ నియోజకవర్గంలోని బోగస్ ఓట్లు ఉన్నాయన్న బీజేపీ అభ్యర్థి మాధవీలత ఆరోపణల గురించి ప్రశ్నించగా... వారు ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. శనివారం హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్‌పురా నియోజకవర్గంలోని ఎమ్మెల్యే మొహమ్మద్ ముబీన్ కలిసి హాశమాబాద్, ఆల్ జుబైల్ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓటర్లతో ముచ్చటించారు. ఎంఐఎం పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అసదుద్దీన్ ఒవైసీ ప్రజలను కోరారు. కాగా, హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ మాధవీలత పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈసారి హైదరాబాద్ ఎంపీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. కాగా, తమిళనాడులో పళనిస్వామి నేతృత్వంలోని ఏఐడీఎంకేకు తాము మద్దతు పలుకుతున్నట్లు అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.
Mulk ke mukhtalif muddo'n par Media se baat-cheet
— Asaduddin Owaisi (@asadowaisi) April 13, 2024
1. @BJP4India propaganda on Fake Voters List
2. Govt of India Advisory to People on Israel
3. BJP Candidate's Remarks on Clothes and Identity pic.twitter.com/K5fw8Z1EnG












Click it and Unblock the Notifications