వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మత సామరస్యానికి ప్రతీక మన రజని ! ఇక బోనాలు , మొహర్రం ఉత్సవాలకు దూరం

|
Google Oneindia TeluguNews

ఇక నుండి హైద్రాబాద్ లో జరిగే అతి ముఖ్యమైన , బోనాలు, మొహర్రం వేడకుల్లో సంప్రదాయాన్ని, వినోదాన్ని పంచుతున్న ఏనుగు ఊరేగింపుకు చెక్ పడింది. వేడుకల్లో ఏనుగును ఊపయోగించకూడదని కోర్టు ఆదేశించింది. దీంతో రానున్న రెండు వేడుకల్లో ఏనుగు లేకుండానే రెండు ఉత్సవాలు కొనసాగునున్నాయి.

మొహర్రం ,బోనాలు హైదరాబాద్ ఫేమ్,

మొహర్రం ,బోనాలు హైదరాబాద్ ఫేమ్,

సాధరణంగా హైదరాబాద్ లో మొహర్రం , బోనాల వేడుకల్లో ప్రత్యేక అతిధి గా రజనీ అనే ఏనుగు ఊరేగింపు లో వినోదాన్ని పంచుతోంది. అయితే 17 ఏళ్లుగా పండగల్లో పాల్గోంటున్న ఏనుగు వయస్సు ప్రస్తుతం 54 ఏళ్లు, దీన్ని చూసేందుకు చాల మంది ఇతర ప్రాంతాల నుండి ప్రత్యేకంగా వస్తారు. దీంతో ఊరేగింపులు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి.

న్యాయస్థానం ఆదేశాలతో నిషేధం

న్యాయస్థానం ఆదేశాలతో నిషేధం

అయితే రెండు ఊరేగింపులకు 54 ఏళ్లు ఉన్న రజనీ అనే ఏనుగును జూపార్క్ నుండి పంపిస్తారు. కాగా ఊరేగింపుపై ఏనుగును నిషేదించాలని హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో కోర్టు తీర్పు చెప్పింది. ముఖ్యంగా ఏనుగులను నియంత్రించే నిపుణులు లేకపోవడం తోపాటు ఇంత పెద్ద జనావాసంలో ఉంచడం కష్టతరం అవుతుందని, కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మరో వైపు సుప్రిం కోర్టు సైతం మతపరమైన ఊరేగింపుల్లో ఏనుగుల ప్రదర్శలను నిషేధించింది. దీంతో హైద్రాబాద్ లో కూడ ఈనిర్ణయాన్ని అమలు చేయనున్నారు.

జంతువులను ఊరేగింపుల్లో వాడడం హింస క్రిందకు వస్తుంది.

జంతువులను ఊరేగింపుల్లో వాడడం హింస క్రిందకు వస్తుంది.

కాగా ఇలాంటీ ఊరేగింపుల్లో , జంతువులను వినియోగించడం జీవహింసకు క్రిందకు వస్తుందని జంతు ప్రేమికులు వాదిస్తున్నారు. మనుషుల హహకారాలు, పెద్ద పెద్ద వాయిద్యాలతో జంతువులు భయపడి ప్రజలకు సైతం ఎదో ఒక సంధర్భంలో ఇబ్బంది కల్గించే అవకాశం ఉందని వారు వాదిస్తున్నారు. దీంతో జంతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్న కోర్టు ఈ తీర్పును వెలువరించింది.

English summary
Tealangana high court banned the elephant in festivals procession in hyderabad, and the Elephant will not be participates next Bonalu and muharram festivals,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X