వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విత్ డ్రాల్, డిజిటల్ ట్రాన్సాక్షన్ పరిమితి ఇది.., రూ.500 నోట్లు ఇలా ఉపయోగించవచ్చు

పాత నోట్లు ఉంటే వాటిని బ్యాంకులలో డిపాజిట్ చేసుకోవచ్చు. ఏటీఎం ద్వారా కొత్త నొట్లను పొందవచ్చు లేదా చెక్కుల ద్వారా బ్యాంకు నుంచి కొత్త నోట్లు లభిస్తాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రూ.500, రూ.1000 నోట్ల మార్పిడి గురువారంతో ముగిసింది. శుక్రవారం నుంచి నోట్ల మార్పిడికి అవకాశం లేదు. ఈ నిర్ణయాన్ని గురువారం రాత్రి ప్రకటించారు. అదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లో మాత్రం నోట్ల మార్పిడి కొనసాగుతుంది.

బయట రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి అవకాశం లేదు. పాత నోట్లు ఉంటే వాటిని బ్యాంకులలో డిపాజిట్ చేసుకోవచ్చు. ఏటీఎం ద్వారా కొత్త నొట్లను పొందవచ్చు లేదా చెక్కుల ద్వారా బ్యాంకు నుంచి కొత్త నోట్లు లభిస్తాయి. పాత నోట్లను బ్యాంకులలో ఈ ఏడాది చివరి వరకు డిపాజిట్ చేయవచ్చు.

- మీరు వారానికి రూ.24వేలు బ్యాంకు నుంచి డ్రా చేసుకోవచ్చు. దీనిలో మార్పు లేదు.
- కార్డు పైన విత్ డ్రా లిమిట్ రోజుకు రూ.2,500

ఈ వ్యాలెట్స్ ద్వారా.. అంటే పేటీఎం తదితరాల వాటి ద్వారా నెలకు రూ.20,000 డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు.

- వాటర్, కరెంట్ బిల్లులు కూడా డిసెంబర్ 15వ తేదీ వరకు పాత రూ.500 నోటుతో కట్టుకోవచ్చు.

Modi

ఇక్కడ మీరు రూ.500 నోటును ఉపయోగించవచ్చు

1 రూ.500 వరకు ప్రీపెయిడ్ మొబైల్ పేమెంట్స్, 2 రూ.5వేల వరకు కన్స్యూమర్ కోఆపరేటివ్ స్టోర్స్‌లో కొనుగోలు, 3 రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కాలేజీలలో ఫీజులు, 4 విదేశీయులు వారానికి రూ.5వేల నగదును మార్చుకోవచ్చు, 5 నీటి, కరెంట్ బిల్లులు (వ్యక్తులు, గృహ సముదాయాలకు మాత్రమే), 6 టోల్ ప్లాజా వద్ద డిసెంబర్ 3 నుంచి రూ.500 నోటు ఇవ్వవచ్చు. (ప్రస్తుతం టోల్ ఫీజు లేదు), 7 ప్రభుత్వ పాఠశాలల్లో రూ.2000 వరకు చెల్లించవచ్చు. 8 ప్రభుత్వ ఆసుపత్రులు, 9 రైల్వే టిక్కెట్లు, 11 ఎయిర్ లైన్స్ టిక్కెట్లు, విమానాశ్రయాలలో, 12 మిల్క్ బూత్‌లలో, 13 స్మశాన వాటికలలో, 14 పెట్రోల్ పంపులలో, 15 మెట్రో రైల్ టిక్కెట్, 16 మెడిసిన్స్, 17 ఎల్బీజీ గ్యాస్ సిలిండర్, 18 రైల్వే కేటరింగ్, 19 నీరు, పవర్ బిల్లు, 20 కన్స్యూమర్ కోఆపరేటివ్ స్టోర్స్, 21, కోర్టులకు, ప్రభుత్వ ఔట్‌లెట్లలో విత్తనాలు.

మరో ఐదు నెలల పాటు నగదు కొరత

మరో నాలుగైదు నెలల పాటు బ్యాంకుల్లో నగదు కొరత కొనసాగే అవకాశం ఉందని బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా( బీఈఎఫ్‌ఐ) అంచనావేసింది. దేశవ్యాప్తంగా నాలుగు నగదు ముద్రణా కార్యాలయాలు వాటి పూర్తి స్థాయి సామర్ధ్యంతో పని చేసినా కొరత ఏర్పడవచ్చని తెలిపింది.

మరోవైపు వచ్చే నెలలో ఉద్యోగులకు జీతాలు పంపిణీలో సమస్యలు తలెత్తవచ్చని దీంతో ప్రజలు మరింత అసహనానికి గురవుతారని పేర్కొంది. ఈ విషయంపై బీఈఎఫ్‌ఐ జనరల్‌ సెక్రటరీ పీకే.బిస్వాస్‌ మాట్లాడుతూ.. నాలుగు కరెన్సీ ముద్రణా సంస్థలు వాటి సామర్థ్యం మేర కరెన్సీని ముద్రిస్తున్నప్పటికీ నగదు కొరత కొద్ది రోజుల పాటు కొనసాగుతుందని నగదు పంపిణీ సాధారణ స్థితికి చేరుకునేందుకు సుమారు నాలుగైదు నెలలు పట్టవచ్చని అంచనా వేశారు.

English summary
The exchange of old currency across the counter has been stopped. The decision was taken last night and immediately announced. However exchange of notes at the Reserve Bank of India would continue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X