చంపుతారామో అయినా బెదరను, స్పీకర్‌కు అధికారమే లేదు, కోర్టులో నాదే విజయం: కోమటిరెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసే హక్కు స్పీకర్‌కు లేనే లేదని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఈ విషయమై కోర్టులో తనకే విజయం లభిస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. శాసనసభ రూల్స్‌కు విరుద్దంగా తమ సభ్యత్వాలను రద్దు చేసిన ఘటనతో తెలంగాణ అసెంబ్లీ తీరు హస్యాస్పదంగా ఉందన్నారు.

స్పీకర్‌ నిర్ణయంపై కోర్టుకు, 48 గంటల దీక్షకు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్

  వినడానికే బాధనిపిస్తోంది.. అక్కడే చచ్చిపోతాడని నాపై దుష్ప్రచారం: కేసీఆర్ ఆవేదన..!

  తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి తన శాసనసభ్యత్వాన్ని రద్దు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం నాడు ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడారు.

  తెలంగాణ అసెంబ్లీలో చోటు చేసుకొన్న పరిణామాలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. న్యాయపరంగా ఈ విషయమై ఎదుర్కొంటామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.

  కోర్టులో విజయం వరిస్తోందన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  కోర్టులో విజయం వరిస్తోందన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  కోర్టులో తనకే విజయం వరిస్తోందని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇంకా ప్రారంభం కాలేదన్నారు. స్పీకర్ తన స్థానంలో కూర్చోలేదని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో ఈ ఘటన చోటు చేసుకొందన్నారు. బిఎసి సమావేశం తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమౌతాయని ఆయన అభిప్రాయపడ్డారు. స్పీకర్ తన స్థానంలోనే కూర్చోలేదన్నారు. మండలి ఛైర్మెన్, శాసనసభ స్పీకర్ గవర్నర్ పోడియం వద్ద ఉన్నారని ఆయన గుర్తు చేశారు. స్పీకర్ తీసుకొన్న నిర్ణయంపై కోర్టును ఆశ్రయించనున్నట్టు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. కోర్టులో తనకే విజయం లభిస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

  నన్ను చంపుతారామో, బెదరను

  నన్ను చంపుతారామో, బెదరను

  రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ పోరాటం సాగిస్తానని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. తనను చంపుతారామోనన్నారు. అయినా ప్రభుత్వ బెదిరింపులకు తాను లొంగే ప్రసక్తేలేదన్నారు. నల్గొండ మున్సిఫల్ ఛైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ హత్య విషయంలో అధికార పార్టీకి చెందిన నేతలు కూడ ఉన్నారని ఆయన ఆరోపించారు. నల్గొండ జిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రిపై కేసులున్నాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. మరో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై కూడ కేసులున్నాయని ఆయన గుర్తు చేశారు.

   పదవులు లెక్కకాదు

  పదవులు లెక్కకాదు

  తనకు పదవులు ఒక్క లెక్క కాదని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకొన్నానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్ళ పాటు తాను ఎదురు చూశానని చెప్పారు. కానీ, రైతులు, ఇతరుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని కోమటిరెడ్డి చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించింనందుకే తనను లక్ష్యంగా చేసుకొన్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

  17 నిమిషాలు ఎలా ఉన్నారు

  17 నిమిషాలు ఎలా ఉన్నారు

  తాను విసిరిన హెడ్‌ఫోన్ తగిలి మండలి ఛైర్మెన్ స్వామిగౌడ్‌ 17 నిమిషాలను ఎలా నొప్పిని ఓర్చుకొన్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. గవర్నర్‌ నరసింహన్‌ను సాగనంపే సమయంలో మండలి ఛైర్మెన్ నవ్వుకొంటూ వెళ్ళిపోయాడని చెప్పారు. గవర్నర్ వెళ్ళిపోయిన వెంటనే స్ట్రెచర్‌పై ఆసుపత్రికి ఎందుకు వెళ్ళాడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Nalgonda former MLA Komatireddy Venkat Reddy said that the Speaker has no right to dissolve his legislative membership.Telugu news channel interviewed him on Tuesday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి