సీఎం కేసీఆర్ చైనా పర్యనటపై ఎంపీ పాల్వాయ గోవర్ధన్ రెడ్డి సెటైర్
హైదరాబాద్: సీఎం కేసీఆర్ చైనా పర్యనట వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించాలన్నారు.
ప్రపంచంలోని ఏ దేశంలోను చైనా తన కార్యక్రమాలను చేపట్టలేదని... అలాంటిది, తెలంగాణలో చేపట్టే అవకాశమే లేదని చెప్పారు. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ప్రభుత్వం భరోసా కల్పించాలన్నారు. సీఎం కేసీఆర్‌ది తుగ్లక్ పాలన అని, రాష్ట్రంలో తీవ్ర కరువు నెలకొన్నప్పటికీ కేంద్రం సాయం కోసం ఆయన ఎందుకు పట్టుబట్టడం లేదని ప్రశ్నించారు.

ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు రుణాల కోసం రైతులపై ఒత్తిడి తేకుండా ప్రభుత్వం చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దిగ్విజయ్ సింగ్ పనితీరుపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొందన్నారు. తెలంగాణకు పూర్తిస్థాయి ఇంఛార్జ్ కావాలన్నారు.
అలాగే సీఎల్పీ నేత జానారెడ్డి కంటే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చక్కగా పనిచేస్తున్నారన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కువగా పోరాటం చేస్తున్నారన్నారు.
రాబోయే రోజుల్లో పీసీసీ, సీఎల్పీ కాంగ్రెస్ కార్యకర్తలతో మమేకమై ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై దూకుడుగా పోరాడాలని పిలుపునిచ్చారు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications