బీజేపికి కాదు.!టీఆర్ఎస్ కు చావుడప్పు కొట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు.!కాసుకో కేసీఆర్.!-డీకే అరుణ.!

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన చేస్తే చావు డప్పు కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై తీవ్రంగా మండిపడ్డారు. ఈ నెల 20 వ తేది సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా చావు డప్పులు కొట్టాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పిలుపునివ్వడంపై డీకే అరుణ నిప్పులు చెరిగారు. వడ్లు కొంటామని ఒకసారి, కొనము అని మరోసారి చెప్తూ తెలంగాణ రైతాంగాన్ని మభ్య పెట్టడమే కాకుండా, వడ్లు కొంటామని ముందు నుంచి చెప్తున్న బీజేపీ పై బురద చల్లే ప్రయత్నం చంద్రశేఖర్ రావు చేస్తున్నారని డీకే అరుణ విమర్శించారు.

కేసీఆర్ ఢిల్లీలో నాటకాలు..

కేసీఆర్ ఢిల్లీలో నాటకాలు..

కేంద్ర ప్రభుత్వం బియ్యం కొంటామని చెప్తునప్పటికి, ఇంత వరకు వరి ధాన్యాన్ని సేకరించకుండా కాలయాపన చేస్తూ, రైతుల ఆత్మ హత్యలకు కారణమవుతున్నారని చంద్రశేఖర్ రావు పై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్య వంతులని చంద్రశేఖర్ రావు మోసపూరిత మాటలు నమ్మి మోసపోరని, చంద్రశేఖర్ రావు కు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని డీకే అరుణ అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే సోయి ఈ ముఖ్యమంత్రికి లేకపోగా, ప్రజల దృష్టి మళ్లించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని డీకే అరుణ విరుచుకుపడ్డారు.

కేసీఆర్ మూర్ఖపు పాలన..

కేసీఆర్ మూర్ఖపు పాలన..

అంతే కాకుండా చంద్రశేఖర్ రావు మూర్ఖపు పాలనవల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, రైతులు గోసపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. చంద్రశేఖర్ రావు విధానాల వల్ల దుక్కుతోచని రైతాంగం ఆత్మహత్య చేసుకుంటున్నారని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా చివరకు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్న దుస్థితి చంద్రశేఖర్ రావు పాలనలో ఉందని, చంద్రశేఖర్ రావు సుపుత్రుడి బినామీ సంస్థ నిర్వాకంవల్ల ఆనాడు 27 మంది ఇంటర్ విద్యార్థులు సూసైడ్ చేసుకున్నరని ధ్వజమెత్తారు డీకే అరుణ.

దృష్టి మళ్లించేందుకే ఢిల్లీ డ్రామా..

దృష్టి మళ్లించేందుకే ఢిల్లీ డ్రామా..

ఇదిలా ఉండగా సమస్యను దారి మళ్లించడానికి టీఆర్ఎస్ నేతలు ధాన్యం కొనుగోళ్ల పేరుతో ఢిల్లీలో డ్రామా చేసేందుకు విమానం ఎక్కారని మండిపడ్డారు డీకె అరుణ. రైతాంగాన్ని, ప్రజలను రెచ్చగొట్టేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టారని, ఎంత రెచ్చగొట్టినా తెలంగాణ రైతాంగం, ప్రజల విజ్ఞులని, వారికి అన్ని అంశాలు తెలుసని, సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారని డీకే అరుణ ధ్వజమెత్తారు. సోమవారం నుండి చంద్రశేఖర్ రావు బీజేపి నేతలను ఉరికిస్తానని బెదిరిస్తున్నాడు. ఎక్కడా తగ్గకుండా సమాధానం చెప్పాలన్నారు డీకే అరుణ.

ప్రజలు గులాబీ పార్టీకి చావు డప్పుకొట్టేందుకు రెఢీ..

ప్రజలు గులాబీ పార్టీకి చావు డప్పుకొట్టేందుకు రెఢీ..

తెలంగాణలో నియంత-కుటుంబ-అవినీతి పాలన రాజ్యమేలుతోందని, ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కుటుంబ పాలనలో బందీ అయ్యిందని, వాస్తవానికి రాష్ట్ర ప్రజలే కాదు, దేశమంతా ఇప్పుడు తెలంగాణవైపు చూస్తోందని, టీఆర్ఎస్ కు అసలు సిసలైన ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని మరో సారి స్పష్టం చేసారు డీకే అనుణ. ఎక్కడైతే అవినీతి, నియంతృత్వం, కుటుంబ పాలన మితిమీరిపోతుందో అక్కడ ప్రతిఘటన మొదలవుతుందని, ప్రజలు మార్పును కోరుకుంటరని అన్నారు. ప్రత్యామ్నాయ పార్టీని ఆదరిస్తారనే అంశానికి భారత దేశ రాజకీయ చరిత్రతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయన్నారు డీకే అరుణ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+