Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణను మర్చిపోయారు: కేంద్ర బడ్జెట్‌పై బీఆర్ఎస్ ఎంపీలు

కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. గ్రామీణాభివృద్ధిని కూడా కేంద్రం నిర్లక్ష్యం చేసిందన్నారు.

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. గ్రామీణాభివృద్ధిని కూడా కేంద్రం నిర్లక్ష్యం చేసిందన్నారు. రూ. 45 లక్షల కోట్లలో రూ. 15 లక్షల కోట్లు అప్పులు తెస్తున్నారని విమర్శించారు. అప్పు తెచ్చిన రూ. 15 లక్షల కోట్లలో రూ. 11 లక్షల కోట్లు వడ్డీలకే పోతున్నాయన్నారు. బడ్జెట్ అనంతరం బీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు, ఇతర ఎంపీలు మీడియాతో మాట్లాడారు.

దేశానికి ఆదాయం తెచ్చే తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఎలాంటి ప్రోత్సాహం అందలేదన్నారు. హైదరాబాద్ కు ఐటీఐఆర్ కేటాయించాలని ఎన్నోసార్లు కోరినా.. బడ్జెట్ లో కేటాయించలేదని ఎంపీ సురేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీఐఆర్ ఇస్తే దేశానికి కూడా ఎంతో ప్రయోజనం ఉండేదన్నారు. రాష్ట్ర పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని కే కేశవరావు ఆరోపించారు.

Nothing to Telangana: BRS MPs fires at Union budget 2023

బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి ప్రస్తావన లేదని ఆయన మండిపడ్డారు. చేనేత రంగానికి కేంద్రం ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వట్టేదని విమర్శించారు. టెక్స్ టైల్ పార్క్‌కు నిధులు ఇస్తారనుకుంటే.. నిరాశే ఎదురైందన్నారు ఎంపీ కేశవరావు. విద్య, ఆరోగ్యానికి నిధులు కోత వేశారన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు.

అన్ని వర్గాల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చినట్లు చెప్పినప్పటికీ.. గ్రామీణాభివృద్ధి, సాగును కేంద్రం నిర్లక్ష్యం చేసిందని బీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. ఇది ఓ జుమ్లా బడ్జేట్ అని ఎద్దేవా చేశారు. విభజన హామీలను ఏ ఒక్కదాన్ని కూడా ప్రస్తావించలేదన్నారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం జరిగిందని ధ్వజమత్తారు.

Nothing to Telangana: BRS MPs fires at Union budget 2023

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ సంస్థలకు కేటాయింపులను గమనించినట్లయితే..

సింగరేణికి రూ. 1650 కోట్లు
మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు రూ. 1473 కోట్లు
ఐఐటీ హైదరాబాద్ కు రూ. 300 కోట్లు కేటాయించారు.

ఏపీ, తెలంగాణకు ఉమ్మడి కేటాయింపులు:

రెండు రాష్ట్రాల్లోని గిరిజన యూనివర్సిటీలకు రూ. 37 కోట్లు
మంగళగిరి, బీబీనగర్ సహా దేశంలోని 22 ఎయిమ్స్ ఆస్పత్రులకు రూ. 6835 కోట్లు
సాలార్జంగ్ సహ ఇతర అన్ని మ్యూజియాలకు రూ. 357 కోట్లు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+