Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆస్ట్రేలియాలో రమ్యకృష్ణ మృతి: భర్తే కారణమని ఆరోపణలు

హైదరాబాద్: ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ రమ్యకృష్ణ అనుమానాస్పద స్థితిలో మరణించింది. రమ్యను అదనపు కట్నం కోసం భర్తే చంపాడని మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

మూడు నెలల క్రితం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో ఉంటున్న మహంత్‌తో హైదరాబాద్‌ కూకట్‌పల్లి వాసి రమ్య వివాహం జరిగింది. రమ్య భర్త మహంత్‌ను కఠినంగా శిక్షించాలంటూ రమ్య బంధువులు ఆందోళనకు దిగారు. శుక్రవారం రాత్రి రమ్య మృతదేహం హైదరాబాద్‌కు చేరుకుంది.

NRI Ramya Krishna dies in Australia, family blames husband

రమ్య ఆత్మహత్య చేసుకున్నట్లు రెండు రోజుల క్రితం కటుుంబ సభ్యులకు సమాచారం అందింది. అత్తింటివారే రమ్యను చంపి ఉంటారని వారు ఆరోపిస్తున్నారు. పెళ్లి సమయంలో కట్నకానుకల కింద భారీగా నగదుతో పాటు బంగారాన్ని కూడా ఇచ్చినట్లు ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.

వ్యాపారంలో భారీగా నష్టాలు రావడంతో మహంత్ గత కొంత కాలంగా అదనపు కట్నం కోసం రమ్యను వేధింపులకు గురి చేస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

రమ్య మృతితో తమకు ఎలాంటి సంబంధం లేదని మహంత్ తండ్రి తెలిపారు. ఏబీఎన్‌తో మాట్లాడుతూ భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు జరగలేదని, రమ్య ఉరేసుకునే చనిపోయిందని ఆయన చెప్పారు. ఆస్ట్రేలియాలో అన్ని రకాలుగా విచారణ జరిపారని చెప్పారు.

భార్య చనిపోతే బీమా వాయిదాలు కట్టాలని మహంత్ బాధపడ్డాడని రమ్య కుటుంబ సభ్యులు అంటున్నారు. భార్య చనిపోతే రెండు వేల డాలర్లకు బాధపడ్డాడని వారన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+