'సాఫ్ట్' బిజినెస్ షాక్: ఎన్నారై టెక్కీని రూ.42 కోట్ల మేర ముంచి, బెదిరింపు
హైదరాబాద్: తనను తన భాగస్వామి రూ.42 కోట్ల మేర మోసం చేశాడని ఓ ఎన్నారై టెక్కీ సోమవారం నాడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను కలిశారు. తాను విదేశాల్లో ఉంటానని, భాగస్వామిగా నమ్మి ఓ సాఫ్టువేర్ కంపెనీ బాధ్యతలను అప్పగిస్తే పెడితే పెద్ద మొత్తంలో మోసం చేశాడని ఆరోపించారు.
డబ్బులు కాజేసిన తన భాగస్వామి కమ్ మేనేజర్ పైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నారై సాఫ్టువేర్ పసుమర్తి వేణుమాధవ్ ముషీరాబాద్ ప్రాంతంలో ఉంటారు. అతను సోమవారం హెచ్చార్సీని ఆశ్రయించారు. విచారణకు స్వీకరించి, జూన్ 30లోపు నివేదిక ఇవ్వాలని పోలీసు కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది.
గత ఇరవై ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి వ్యాపారం చేసుకుంటున్నానని, ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడ మెటీరియల్స్ సాఫ్టువేర్ సిస్టమ్స్ పేరిట కంపెనీని ఏర్పాటు చేశానని బాధితుడు తెలిపారు. నిర్వహణ బాధ్యతల్ని (మేనేజర్‌గా) బర్కత్‌పురకు చెందిన శంతన్ కుమార్‌కు అప్పగించానని, పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చానన్నారు.
ఇదే అదనుగా శంతన్‌కుమార్ తన ఆస్తులను, డబ్బు, ఇన్సూరెన్స్ పాలసీలు ఇలా మొత్తంగా రూ.42 కోట్ల వరకు కాజేశాడని పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ పాలసీకు సంబంధించి ఇప్పటికే సైఫాబాద్ పోలీసు స్టేషన్లోఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

జవహర్‌నగర్ పోలీసు పోలీస్ స్టేషన్లో కూడా తన ఇంటికి సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించి మోసం చేసిన కేసు శంతన్ కుమార్‌పై నమోదయిందని చెప్పారు. మోసం చేయడమే కాకుండా ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితుడు వేణుమాధవ్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
ఇటీవల తన పైన ఎదురుగా కేసు పెట్టి, రాజకీయ అండతో తనను బెదిరిస్తున్నాడని ఆరోపించారు. అతను తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని, తన ప్రాణాలకు ముప్పు ఉందని వేణుమాధవ్ ఆరోపించారు. తాను 2005లో వచ్చి ఈ కంపెనీని ప్రారంభించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications