వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దళత నేతల పట్ల అసభ్య పోస్టింగులు.!బీజేపి తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలన్న బాల్క సుమన్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అధికార గులాబీ పార్టీ ప్రజా ప్రతినిధులు డీజిపి కార్యలయం బాట పట్టారు. తమకు న్యాయం చేయాలంటూ రాష్ట్ర డిజీపి కార్యాలంయంలో వినతిపత్రం అందజేసారు. దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం పై అడిషనల్ డిజి జితేందర్ కు ఫిర్యాదు చేసామని ప్రభుత్వం విప్ బాల్క సుమన్ తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫేక్ వీడియో తయారు చేసి ప్రచారం చేయడమే కాకుండా, సోషల్ మీడియాలో టిఆర్ఎస్ నేతలపై బీజేపీ సోషల్ వింగ్ అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపిస్తున్నారు గులాబీ నేతలు.

 సోషల్ మీడియాలో బీజేపీ తప్పుడు ప్రచారం.. ఫోలీసలకు ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నేతలు

సోషల్ మీడియాలో బీజేపీ తప్పుడు ప్రచారం.. ఫోలీసలకు ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నేతలు

ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తున్న ఫేక్ వీడియో పై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని అడిషనల్ డిజి జితేందర్ కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేసామని గులాబీ పార్టీ ఎమ్మెల్యే స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో దళిత ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల, ఎంపీల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నం బీజేపి నేతలు చేస్తున్నారని మండిపడ్డారు. తమపై తప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేసినట్టు గులాబీ నేతలు స్పష్టం చేసారు.

 మహిళలను లాగడం తప్పు.. బీజేపి నేతలకు ఇంగిత జ్ఞానం లేదన్న బాల్క సుమన్

మహిళలను లాగడం తప్పు.. బీజేపి నేతలకు ఇంగిత జ్ఞానం లేదన్న బాల్క సుమన్

అంతే కాకుండా బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా కుటుంబాలు ఉన్నాయని, వాళ్ల మహిళా కుటుంబ సభ్యుల మీద తప్పుడు వీడియోలు తయారు చేసి ప్రచారం చేయాలంటే తమకు ఒక్క నిమిషం సమయం పట్టదని హెచ్చరించారు. కానీ తమకు సంస్కారం ఉందని,
అందరికి కుటుంబాలు ఉంటాయని, వారిని చులకన చేసుకోవడం ఎవరికి ఇష్టం ఉండదని, రాజకీయాల్లోకి వారిని లాగడం దిడజారుడుతనమని టీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.

 మేం కూడా తప్పడు వీడియోలు చేస్తాం.. అసత్య ప్రచారం చేస్తామన్న గులాబీ నేతలు

మేం కూడా తప్పడు వీడియోలు చేస్తాం.. అసత్య ప్రచారం చేస్తామన్న గులాబీ నేతలు

తప్పుడు వీడియోలతో బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, గువ్వల బాలరాజు మీద అనేక ఫేక్ వీడియోలు ప్రచారం చేసారని, దళిత నేతల ఎదుగుదల చూసి బీజేపీ ఓర్చుకోవడం లేదని మండిపడ్డారు. సోషల్ మీడియాలలో తప్పుడు పోస్టులు పెడుతున్న వారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గులాబీ నాయకులు. పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోక పోతే తామే రంగంలోకి దిగుతామని హెచ్చరించారు. సోషల్ మీడియాలలో ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తున్న వారిపై సుమోటోగా కేసులు నమోదు చేయాలి సూచించారు.

Recommended Video

Farms Laws వెనక్కి తీసుకోవడం KCR విజయం! - TRS నేతలు || Oneindia Telugu
 సు మోటోగా కేసు నమోదు చేయాలి.. డిజీపి కార్యాలయంలో టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

సు మోటోగా కేసు నమోదు చేయాలి.. డిజీపి కార్యాలయంలో టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

ముఖ్యమంత్రి పైన కూడా తప్పుడు వీడియోలు చిత్రీకరిస్తున్నారని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పైకూడా లెక్కలేనన్ని వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టి వైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకులు రంగంలోకి దిగితే బండి సంజయ్ నుండి ఈటెల రాజేందర్ వరకు ఎవ్వరినీ ఉపేక్షించమని హెచ్చరించారు. వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విదంగా సోషల్ మీడియాలో దళిత నేతలను బీజేపీ టార్గెట్ చేస్తుందని, దీనిపై అడిషనల్ డిజి కి ఫిర్యాదు చేసామని సోషల్ మీడియాను వేదికగా చేసుకుని దళిత నాయకులపై బురద జల్లుతున్నారని, బీజేపీ నాయకులు ప్రత్యక్షంగా ఎదుర్కొనలేక తప్పడు ప్రచారానికి తెగబడ్డారని గులాబీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు.

English summary
Government whip Balka Suman said they had lodged a complaint with Additional DG Jitender over false propaganda on social media against Dalit MLAs, MPs and MLCs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X