వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

70 ఎకరాల భూములను కబ్జా చేశారు.!ఈటల రాజేందర్ ముక్కు నేలకురాయాలన్న బాల్క సుమన్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : హుజురాబాద్ బీజేపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మరోసారి మండిపడ్డారు. ఈటల భార్య జమున హచరిస్ వ్యవహారంపైన మెదక్ కలెక్టర్ మాట్లాడిన అంశాలను ఈటల తప్పుబట్టం ఎందుకని బాల్క సుమన్ ప్రశ్నించారు. ఈటల రేజేందర్ ప్రభుత్వ, ఎస్సి, ఎస్టీ భూములను కబ్జా చేసారని కలెక్టర్ చెప్పారని, అందులో తప్పేముందని సుమన్ నిలదీసారు. ఎస్సి,ఎస్టీల భూములను అడ్డగోలుగా కబ్జా చేశారని, నీతి నిజాయితీ ఉంది అంటున్న ఈటల రాజేందర్ 70 ఎకరాల భూములను ఎలా కబ్జా చేస్తారని ధ్వజమెత్తారు. ఆధారాలతో సహా చూపిస్తే కలెక్టర్ మీద కేసులు పెడతానని బెదిరించడం ఏంటని సుమన్ ప్రశ్నించారు.

 70 ఎకరాలు కబ్జా చేసాడు

70 ఎకరాలు కబ్జా చేసాడు

వెనకబడిన వర్గాలకు చెందిన భూములను కబ్జా చేసినందుకు తప్పైందని ఈటల రాజేందర్ ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేసారు సుమన్. కబ్జాలు చేసేది వీల్లే, నోరు లేని పేదల భూములను లాక్కునేది వీళ్లే అని మండిపడ్డారు. పర్యావరనానికి హాని కలిగించడమే కాకుండా రాజ్యాంగ బద్ద హోదాలో ఉన్న అధికారులను నిందిస్తున్నారని మండిపడ్డారు. పేదల భూముల ఆక్రమించానని రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తానని ఈటల రాజేందర్ గతంలో స్పష్టం చేసాడని, మరి కలెక్టర్ చెప్పిందని ప్రకారం భూములు ఆక్రమించినట్టు నిర్ధారణ అయ్యిందని, ముక్కు నేలకు రాస్తారా అని ఈటల రాజేందర్ ను సుమన్ సూటిగా ప్రశ్నించారు. హుజురాబాద్ ప్రజలు ఇప్పటికైనా ఈటల తీరును గమనించాలని విజ్ఞప్తి చేసారు.

 అవినీతి ఈటల పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి..

అవినీతి ఈటల పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి..

ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి, పేదల భూములు పేదవారికి ఇవ్వాలని బాల్క సుమన్ డిమాండ్ చేసారు. ఈటల రాజేందర్ పైన రాబోయే రోజుల్లో చట్టపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయని సుమన్ హెచ్చరించారు. కబ్జాకోరు దగాకోరు లాంటి వాళ్ళ నిజస్వరూపాన్ని హుజురాబాద్ ప్రజలు గమనించాలని, మెదక్ జిల్లా కలెక్టర్ నిజాయితీగా పని చేస్తున్నాడని, కానీ అతన్ని భయపట్టే ప్రయత్నం చేస్తున్నారని ఈటల మీద ఘాటు వ్యాఖ్యలు చేసారు సుమన్. ఈటల ఇంకా ఎక్కడెక్కడ భూములు కబ్జాకు గురయ్యయ్యో కలెక్టర్ నిగ్గూ తేల్చాలని, అధికారులను, కలెక్టర్ పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సుమన్ హెచ్చరించారు.

ఈటలను బీజేపీ సస్పెండ్ చేయాలి..

ఈటలను బీజేపీ సస్పెండ్ చేయాలి..

ఈటల రాజేందర్, అతని భార్య జమున మాట్లాడిన విధానాన్ని ఖండిస్తున్నట్టు సుమన్ పేర్కొన్నారు. అంతే కాకుండా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరు దున్నపోతు మీద వాన పడ్డట్లు ఉందని మండి పడ్డారు. ఒక వార్షిక ప్రణాళిక చేయండి అంటే ఆ ఊసే ఎత్తడం లేదని, ఇన్ని రోజులుగా నిరసన చేస్తుంటే కేంద్రం పట్టించుకోకుండా ఉందని, మొండి వైఖరి, దుర్మార్గమైన వైఖరితో కేంద్రం వ్యవహరిస్తుందని బాల్క సుమన్ కేంద్ర బీజేపి ప్రభుత్వంపైన విరుచుకు పడ్డారు.

కలెక్టర్లకు ఈటెల బెదిరింపులు..

కలెక్టర్లకు ఈటెల బెదిరింపులు..

బీజేపి ఎంపీ ధర్మపురి అరవింద్ అసలు మనిషేనా అని, ధర్మపురి అరవింద్ బట్టలూడదీసి కొట్టాలని సుమన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. పసుపు బోర్డు తెస్తా అన్న అరవింద్ తీసుకొచ్చాడా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ చేసిన పనులు ఏమైనా అరవింద్ కు తెలుసా అని నిలదీసారు. రేవంత్ రెడ్డి ఏనాడు తెలంగాణ కోసం పనిచేయలేదని, హైద్రాబాద్ అభివృద్ధికి కేటీఆర్ చేస్తున్న కృషి వీళ్లకు కనిపించదని ఎద్దేవా చేసారు. తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ సభ్యుడిగా అవకాశమిచ్చి విఠల్ ను గౌరవించిందని, పదవి లేకపోతే టీఆర్ఎస్ ను తిట్టడమేనా.? పదవీకాలం ఐపోగానే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం ఫ్యాషన్ గా మారిందని సుమన్ మండిపడ్డారు.

English summary
Balka Suman demanded that government lands be given to the government and poor lands to the poor. Suman warned that legal action would be taken against Itala Rajender in the coming days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X