సర్పంచ్ ప్రమాణస్వీకారంలో విచిత్ర పరిస్థితి.. ఇద్దరికీ గెలుపు సర్టిఫికెట్లు !!
తెలంగాణలో పల్లె పోరు ముగిసి నేడు సర్పంచులుగా గెలుపొందిన వారు ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లోని 564 మండలాల్లో గల 12,728 పంచాయతీలు.. 1,12,242 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. కాగా ఈరోజు ( డిసెంబర్ 22, 2025, సోమవారం ) నూతనంగా గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు తమ పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ముందుగా వార్డు సభ్యులు.. ఆ తర్వాత సర్పంచ్, ఉప సర్పంచ్‌లు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు.
అయితే మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామపంచాయతీలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు గెలిచినట్లుగా అధికారులు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం కలకలం రేపుతోంది. ముందు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి స్వాతి మూడు ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించి గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేశారు.

అయితే అరగంట గడిచిన తర్వాత ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సుజాత ఒక్క ఓటు తేడాతో గెలిచినట్లు మళ్లీ ప్రకటించారు. ఆమెకూ ధ్రువీకరణ పత్రం అందజేయడం గందరగోళానికి దారి తీసింది. దీంతో ఇద్దరు అభ్యర్థులు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేసుకున్నారు. తమ బంధువులు, అనుచరులను ఆహ్వానించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీసింది.
ప్రమాణస్వీకారానికి ఇద్దరు అభ్యర్థులు రావడంతో అధికారులు షాకయ్యారు. దీంతో ఎవరు నిజమైన సర్పంచ్ అన్నది తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు. దీంతో ఒకే గ్రామంలో ఇద్దరు సర్పంచులకు గెలుపు సర్టిఫికెట్లు ఎలా ఇస్తారంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి స్పష్టత ఇవ్వాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఇలాంటి పొరపాటు జరిగిందా? లేక లెక్కలలో తేడా ఉందా? అన్న అంశంపై ఉన్నతాధికారుల విచారణ జరగాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

-
ఇల్లు కట్టే వారికి బంపర్ ఆఫర్: కొత్త బిల్డింగ్ రూల్స్ ఇవే.. -
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం: పైలెట్ రోహిత్ రెడ్డికి బిగ్ షాక్! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications