NREGA: ఉపాధి హామీ పని పైసలు రావాలంటే ఇది చేయాల్సిందే..!
పని లేక ఇబ్బంది పడుతున్న పేదల కోసం అప్పటి యూపీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ఇప్పటి వరకు విజయవంతంగా అమలు జరుగుతోంది. అయితే ఈ పథకం కింద ఉపాది పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ చెల్లింపు బ్రిడ్జి సిస్టమ్ కు మారాలి. ఎప్పటి నుంచో బ్రిడ్జి సిస్టమ్ కు మారాలి అధికారులు కోరుతున్నారు. ఇందుకు కోసం చివరి తేదీ ప్రకటిస్తూ.. మూడునాలుగసార్లు వాయిదా కూడా వేశారు. కానీ ఇప్పుడు తప్పనిసరిగా బ్రిడ్జి సిస్టమ్ మారాలని స్పష్టం చేశారు. లేకుంటే ఈ పథకం కింద ఉపాధి పొందలేరని చెబుతున్నారు.
ఉపాధి హామీ కింద పని చేసిన వారికి ఆగస్టు 31వ తేదీ వరకే బ్యాంకు ఖాతా, ఆధార్ ఆధారిత పద్ధతుల్లో డబ్బులు జమ చేస్తారు. ఆ తర్వాత ఆధార్-ఎనెబుల్డ్ పేమెంట్ సిస్టమ్ కాకుండా ఏబీపీఎస్ ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ కొత్త విధానంలో భాగంగా ఉపాధి హామీ జాబ్‌కార్డ్ హోల్డర్, తన జాబ్‌కార్డ్‌ను బ్యాంక్ ఖాతా, ఆధార్‌తో అనుసంధానం చేయడంతో పాటు దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) మ్యాపర్‌తో తప్పనిసరిగా అనుసంధానించాలి.

ఆధార్‌తో బ్యాంక్ అకౌంట్ సీడింగ్, ఎన్‌పీసీఐ మ్యాపర్‌లో మ్యాపింగ్ చేయడానికి ఖాతాదారు కేవైసీ వివరాలు, బయోమెట్రిక్, స్థానికత, ఆధార్ డేటా బేస్-బ్యాంక్ ఖాతాల్లోని వివరాల్లో తేడాలు లేకుండా చూసుకోవాలి ఒకవేళ తేడా ఉంటే సవరించుకోవాలి లేకుంటే చెల్లింపులు ఆగిపోతాయి. ఉపాధి కూలీలు బ్యాంక్ ఖాతాలను తరచుగా మార్చడం, దానిని ప్రోగ్రామ్ ఆఫీసర్లు అప్‌డేట్ చేయకపోవడం, తదితర కారణాల నేపథ్యంలో లబ్దిదారులకు నష్టం జరగకుండా ఏబీపీఎస్ అత్యుత్తమ ప్రత్యామ్నాయమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ చెబుతోంది.
కేంద్ర ప్రభుత్వం సాంకేతిక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి ఉపాధిహామీ చట్టం ఆశయాలు, లక్ష్యాలను నీరుగారుస్తుందని నిపుణులు ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణలోని మొత్తం కోటీ ఐదు లక్షల మంది (ఇన్ యాక్టివ్ వర్కర్లతో సహా) ఉపాధి కూలీల్లో 42 లక్షల మంది ఏబీపీఎస్‌కి అనర్హులుగా ఉండిపోయారని చెబుతున్నారు. పనిచేస్తున్న 61 లక్షల కూలీల్లో (యాక్టివ్ వర్కర్స్) 5.33 లక్షల మంది ఏబీపీఎస్‌కి అర్హత సాధించలేకపోయారట. యాక్టివ్ వర్కర్స్ కేటగిరీలో ఏబీపీఎస్ అర్హత విషయంలో మొత్తం కార్మికుల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్నపుడు గణనీయమైన సంఖ్యలో కార్మికులు దీనికి అర్హత సాధించలేదని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications