'ఓజీ' సినిమాకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం ఓజీ కి బిగ్ షాక్ తగిలింది. ఈ మూవీకి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది న్యాయస్థానం. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను జస్టిస్ ఎన్. వి. శ్రవణ్ కుమార్ జారీ చేశారు. ఇక ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా ఓజీ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఈ సినిమాకు బెనిఫిట్ షో, టికెట్ల రేట్లు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి 10 గంటలకు ప్రదర్శించాల్సిన ప్రీమియర్స్ , ఇప్పటికే కొనుగోలు చేసిన టికెట్లపై సందిగ్ధం నెలకొంది.

OG Shocker Pawan Kalyan s Power Star Film Hit by Telangana High Court Benefit Shows and Ticket Hikes Cancelled

ఇటీవల ఓజీ సినిమా టికెట్ల రేట్లను ఏపీ ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం 10 రోజల వరకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. పెంచిన టికెట్ ధరలు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబరు 4 వరకు అమల్లో ఉంటాయని జీవోలో పేర్కొంది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లను పెంచింది. నైజాం ఏరియాలో ఓజీ టికెట్ ధరల్ని సింగిల్ స్క్రీన్స్‌ కు రూ.100, మల్టీప్లెక్స్‌ లకు రూ.150 చొప్పున పెంచుకోవచ్చని తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

అంతేకాక సెప్టెంబర్ 24 బుధవారం రాత్రి 9 గంటలకు ప్రదర్శించే స్పెషల్ ప్రీమియర్ షోకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ షో టికెట్‌ ధర రూ.800 కు కూడా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా ఈ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+