వామ్మో.. కవిత ప్రత్యర్థులు 189 మందా..? రంజుగా సాగుతున్న రైతుల రాజకీయం..!!
Recommended Video

నిజామాబాద్/హైదరాబాద్ :నిజామాబాద్ లో రైతుల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ప్రత్యర్థి ఎవరైనా సరే రాజీ పడే ప్రసక్తే లేదంటున్నారు రైతులు. పసుపు, ఎర్రజొన్న పంటకు మద్దతు ధర కోసం వినూత్నంగా నిజామాబాద్ రైతులు నిరసన తెలుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఇప్పుడు దేశం దృష్టి నిజామాబాద్‌పై పడింది. ఇక్కడి నుంచి బరిలో ఉన్న టీఆర్ఎస్ మహిళా నేత కల్వకుంట్ల కవితపై 180 మందికిపైగా రైతులు పోటీ చేయడమే ఇందుకు కారణం. నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో పూర్తి కానుండగా ఒక్క రైతు కూడా ముందుకు రాకపోవడంతో టీఆర్ఎస్ నేతలను కలవరపరుస్తోంది. ఈ స్థానం నుంచి మొత్తం 203 నామినేషన్లు దాఖలు కాగా, పరిశీలన అనంతరం 189 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
నామినేషన్ వేసిన వారిలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, పిరమిడ్, బహుజన ముక్తి, సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్‌తో పాటు మరో ఇద్దరు స్వతంత్రులు ఉండగా, మిగతా వారంతా రైతులే కావడం గమనార్హం. తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కవిత ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదని ఆరోపిస్తూ పసుపు, ఎర్రజొన్న రైతులు ఆమెపై పోటీ చేసేందుకు బరిలోకి దిగారు.
లోకసభ ఎన్నికలు 2019: జోరుగా టీఆర్ఎస్ నేతల ప్రచారం

దీంతో ఓట్లు చీలిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న అదికార గులాబీ పార్టీ, రైతులు వేసిన నామినేషన్లు ఉపసంహరింపజేయాలని ప్రయత్నించింది. సమస్యలు పరిష్కరిస్తామంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. రైతులు మాత్రం ససేమిరా అంటున్నారు. వెనక్కి తగ్గేది లేదని, బరిలోనే ఉంటామని తెగేసి చెబుతున్నారు. దీంతో నిజామాబాద్ లోక్ సభ పోరుపై అందరి ద్రుష్టి నెలకొంది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications