బాబోయ్.. ఇదేం చ‌లిరా నాయ‌నా..! ఊటీని మించిపోయిన హైద‌రాబాద్..!!

హైద‌రాబాద్ : అస‌లే శీతాకాలం.. డిసెంబ‌రు మాసం.. ఇప్ప‌టికే తెలుగురాష్ట్రాల్లో ఉష్ణోగ్ర‌త‌లు రోజురోజుకీ ప‌డిపోతున్నాయి. గ‌త వారం, ప‌ది రోజులుగా హైద‌రాబాద్ స‌హా అన్నిచోట్ల ఉష్ణోగ్ర‌త‌లు క‌నిష్ఠానికి ప‌డిపోయాయి. ఈ ద‌శ‌లో ఏర్ప‌డిన పెథాయ్ తుఫాను.. తెలుగు ప్ర‌జ‌ల‌తో బాబోయ్ అనిపించింది. రాత్రి ఉష్ణోగ్ర‌త్త‌ల‌నే త‌ట్టుకోలేక‌పోతుంటే.. రాత్రీ ప‌గ‌లూ తేడా లేకుండా వాతావ‌ర‌ణం ఒక్క‌సారి మారి పోయేసరికి ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. ఎముక‌లు కొరికే చ‌లిధాటికి విల‌విలలాడుతున్నారు. పెథాయ్ తుపాను కార‌ణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తోపాటు తెలంగాణ‌పైన ప్ర‌భావం తీవ్రంగా ప‌డింది.

పెథాయ్ తుఫాన్ ప్ర‌భావం..! చ‌లితో వ‌ణికిపోతున్న తెలంగాణ ప్ర‌జానికం..!!

పెథాయ్ తుఫాన్ ప్ర‌భావం..! చ‌లితో వ‌ణికిపోతున్న తెలంగాణ ప్ర‌జానికం..!!

ఆంధ్ర‌లో తీరం వెంట భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌గా తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కాకుండా అక్క‌డ‌క‌క్క‌డ చెదురుమొదురు జ‌ల్లులు ప‌డుతున్నాయి. తెలంగాణ ప్ర‌జ‌లు కూడా మ‌రీ ముఖ్యంగా హైద‌రాబాద్ వాసులు తెలంగాణ‌లో ఉన్నామా.. లేక .. తీరం వెంట ఉన్నామా.. అన్న భావ‌న‌లో ఉండిపోయారు. మూడు రోజులు ఆకాశంలో సూరీడి జాడ లేక ఎండ త‌గ‌ల‌క‌.. సూర్య‌భ‌గ‌వానుడి కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. మ‌రో మూడు రోజులు ఇదే త‌ర‌హా వాతావ‌ర‌ణం ఉంటుందున్న వాతావ‌ర‌ణ శాఖ సూచ‌న‌ల‌తో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతూ ఎలా త‌ట్టుకోవాల‌న్న ప్ర‌త్యామ్నాయాలు వెతుక్కునే ప‌నిలో ప‌డ్డారు.

రాత్రి ప‌గ‌లుకి తేడా లేదు..! అదే తీవ్ర‌త ..! అదే వ‌ణ‌కు..!!

రాత్రి ప‌గ‌లుకి తేడా లేదు..! అదే తీవ్ర‌త ..! అదే వ‌ణ‌కు..!!

చ‌లి తీవ్రత గ‌తంలో ఉద‌యం ప‌ది గంట‌ల‌కే క‌నిపించేది. తుపాను ప్ర‌భావంతో సూరీడు రాక‌పోక‌వ‌డంతో రోజంతా వ‌ణ‌కాల్సి వ‌స్తోంది. స్వెటర్లు, మ‌ఫ్లర్లు, మంకీ క్యాప్‌లు లేనిది బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థ‌తి. ఇక తెలంగాణ‌లోని పల్లెలు.. ఉద‌యం పూట కురిసే మంచుతీవ్ర‌త‌కు కాశ్మీర్‌ను త‌లపిస్తున్నాయి. చాలాచోట్ల ప్ర‌జ‌లు చ‌లి మంటలు వేసుకుని వెచ్చ‌ద‌నం కాసుకుంటూ సేద తీరుతున్నారు. తెలంగాణ‌లోని తాండూరులో ఏకంగా 8.3 డిగ్రీల అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త న‌మోదు కావ‌డం విశేషం..!

 ఇంట్లో నుంచి కాలు బ‌య‌ట‌పెట్ట‌లేని ప‌రిస్థితి..! బ‌య‌ట కాలు పెడితే గ‌జ‌గ‌జే..!!

ఇంట్లో నుంచి కాలు బ‌య‌ట‌పెట్ట‌లేని ప‌రిస్థితి..! బ‌య‌ట కాలు పెడితే గ‌జ‌గ‌జే..!!

హైద‌రాబాద్‌లోని 16-18 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోద‌వుతోంది. ఆకాశం మేఘావృత‌మై ముసురుప‌ట్టిన కార‌ణంగా విప‌రీత‌మైన చలిగాలులు వీస్తుండ‌టంతో ఇళ్ల నుంచి కాలు బ‌య‌ట‌పెట్ట‌లేక‌పోతున్నారు. ఎక్క‌డికైనా బండి మీద వెళ్లాల‌న్న స్వెట‌ర్లు వేసుకుని.. పూర్తిగా క‌ప్పుకొని వెళ్లాల్సి వ‌స్తోంది. మిట్ట‌మధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యంలోనూ చ‌లిగాలులు ప్ర‌జ‌లను వ‌ణికిస్తున్నాయి. ఇంటికి త‌లుపులు బిగించుకుని లోప‌ల కూర్చోవాల్సి వ‌స్తోంది. తెలంగాణ‌లో ముసురు ప‌ట్టి వాతావ‌ర‌ణం ఉంటే తీరంలో వ‌ర్షాలు కార‌ణంగా చ‌లి తీవ్ర‌త పెరిగి ప్ర‌జ‌లు ప్రాణాల మీదకు వ‌స్తోంది.

ముస‌లి ముత‌క ఓంన‌మః శివాయ‌..! చ‌లికి త‌ట్టుకోలేని ప‌రిస్థితులు..!

ముస‌లి ముత‌క ఓంన‌మః శివాయ‌..! చ‌లికి త‌ట్టుకోలేని ప‌రిస్థితులు..!

చ‌లి తీవ్ర‌త కార‌ణంగా రెండు రాష్ట్రాల్లో అయిదుగురు వృద్ధులు చ‌నిపోయారు. ఈ వాతావ‌ర‌ణంతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. విష‌జ్వ‌రాలు ప్ర‌బ‌లే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. ఇక చ‌లి తీవ్రత పెర‌గ‌డంతో స్వెట‌ర్లు కొనుగోలు చేస్తుండ‌టంతో ఆ దుకాణాల వ‌ద్ద డిమాండ్ పెరిగి బాగా గిరాకీ ఏర్ప‌డింది. అంతే కాకుండా చ‌లి తీవ్ర‌త‌ను త‌ట్టుకోలేని వ‌య‌సు పైబ‌డిన కొంత‌మంది వ్రుద్దుల‌కు ఈ చ‌ల్ల‌టి వాతార‌ణం ప్రాణ సంక‌టంగా మారింది. చ‌లి తీవ్ర‌త‌త‌తో వ్రుద్దులు ఉన్న ఇళ్ల‌ల్లో ఎప్పుడు ఎలాంటి విషాద వార్త వినాల్సొస్తుందేమోన‌ని న‌గ‌ర వాసుల్లో మ‌రో టెన్ష‌న్ పెరిగిపోందోంద‌ట‌..!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+