వారికి గ్యాస్ సబ్సిడీ పథకం నిలిపివేత, ఇలా చేయండి- ఇక తప్పనిసరి..!!
వంట గ్యాస్ సబ్సిడీ అందుకుంటున్న వారికి బిగ్ అలర్ట్. కేంద్ర పెట్రోలియం శాఖ కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు అనేక రకాలుగా వంట గ్యాస్ సబ్సిడీ అందుకుంటున్న వినియోగదారుల కు ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. ఈ మేరకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. కాగా, ఇప్పటి వరకు పూర్తి చేయని వినియోగదారులకు సబ్సిడీ పథకం రద్దు అవుతుందని తాజాగా స్పష్టం చేసింది.
గృహావసరాలకు వంట గ్యాస్ ఉపయోగిస్తున్న వినియోగదారులకు ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ కేంద్ర పెట్రోలియం శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకం లబ్ధిదారులు ప్రతియేటా మార్చి 31 లోపు ఈ- కేవైసీ వివరాలు సమర్పించాలని ఇప్పటికే నిబంధన ఉంది. వివరాలు ఇవ్వని వారికి సబ్సిడీ పథకాలు నిలిపి వేస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ తేల్చి చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 1.50 కోట్ల గృహ గ్యాస్ వినియోగదారులు ఉండగా ఇప్పటి వరకు 60 శాతం మంది మాత్రమే స్పందించారు. ఉజ్వల పథకం లబ్ధిదారులు ప్రతియేటా ఒకసారి ఈ- కేవైసీ ఇవ్వకపోతే... ఏడాదిలో వారికిచ్చే 8వ, 9వ సిలిండర్ల సబ్సిడీ నిలిపివేస్తామని ఆయిల్ కంపెనీలు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి.

అదే విధంగా బయోమెట్రిక్ ధృవీకరణ మార్చి 31 లోపు పూర్తికాకపోతే... ఈ సంవత్సరానికి సంబంధించి నిలిపివేసిన సబ్సిడీని శాశ్వతంగా రద్దుచేస్తామని స్పష్టంచేశారు. అయితే సబ్సిడీ రాకపోయినా గ్యాస్ సరఫరా, రీఫిల్ బుకింగ్‌కు అంతరాయం ఉండదని, మొత్తం ధర చెల్లించి సిలిండరు తీసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, వినియోగదారులు మొబైల్ యాప్ ద్వారా బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ చేసుకునే అవకాశం కల్పించారు. క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి మొబైల్ ద్వారా చేసుకోవచ్చు. సంబంధిత ఏరియా పంపిణీకేంద్రానికి వెళ్లి చేసుకొనే అవకాశం కల్పించారు. గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చే డెలివరీ సిబ్బంది కూడా ఈ- కేవైసీ నమోదు చేస్తున్నారు. దీంతో.. ఇప్పటికీ పూర్తి చేయని వినియోగ దారులు వెంటనే నమోదు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications