• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

దిమ్మతిరిగే నోట్ల కట్టలు, పోలీసులు అవాక్కు: హైదరాబాదు లింక్

By Pratap
|
  దిమ్మతిరిగే నోట్ల కట్టలు..పోలీసులు అవాక్కు !

  న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో దిమ్మతిరిగే పాత నోట్ల కరెన్సీ డంప్ బయటపడింది. రద్దయిన రూ.500, రూ. 1000 నోట్ల డంప్ అది. ఈ పాతనోట్లను కొత్త నోట్లతో మార్పిడి చేసేందుకు16 మంది కుట్ర చేసినట్లు బయటపడింది. వారిని పోలీసులు అరెస్టు చేశారు.

  కాన్పూర్‌కు చెందిన ఆనంద్ ఖత్రీ అనే బిల్డర్ పూర్వీకుల ఇంట్లో ఈ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని రిజర్వ్ బ్యాంకుకు, ఆదాయం పన్ను శాఖకు అందించారు. ఈ డంప్ వ్యవహారంలో హైదరాబాద్ లింక్ వెలుగు చూసింది.

   నోట్లను ఇలా కుక్కేశారు...

  నోట్లను ఇలా కుక్కేశారు...

  ఖత్రీ ఇంట్లో తనిఖీ చేసినప్పుడు ట్రంకు పెట్టెల నిండా, గోనె సంచుల్లో కక్కి ఉన్న పాత నోట్ల కట్టలనూ చూసి పోలీసులు నివ్వెరపోయారు. 80 మంది పోలీసులు 37 యంత్రాలతో నోట్లను లెక్కించారు. 12 గంటల పాటు లెక్కంచారు. దాదాపు 97 కోట్ల లెక్క తేలినట్లు సమాచారం. ఈ కేసు మూలాలు చాలా పాతవని పోలీసులు భావిస్తున్నారు

   ఇలా డీల్ కుదుర్చుకున్నారు...

  ఇలా డీల్ కుదుర్చుకున్నారు...

  హైదరాబాద్, కోల్‌కతా, వరణాసి నగరాలకు చెందిన పలువురు వ్యాపారులు, దళారులు కొద్ది రోజుల కిందట కాన్పూర్ చేరుకుని వేర్వేరు హోటల్లో బస చేసి పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చేందుకు డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. ఈ డీల్ వెనక సూత్రధారిన ఆనంద్ ఖత్రీది.

   పాత నోట్ల బాధ్యత ఖత్రీది...

  పాత నోట్ల బాధ్యత ఖత్రీది...

  పాత నోట్లను తెచ్చే బాధ్యతను ఖత్రీ తన మీద వేసుకున్నట్లు తెలస్ోంది. వాటిని కొత్త నోట్లుగా మార్చే బాధ్యతను హైదరాబాదు, కోల్‌కతాలకు చెందిన కోటేశ్వర రావు, అలీ హుస్సేన్, రాజేశ్వరిర రంగారావు, మనీష్ అగర్వాల్, సంజేవ్ అగర్వాల్ అనే ఏజెంట్లు భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది.

  ఇలా మారుస్తున్నారు...

  ఇలా మారుస్తున్నారు...

  ఖత్రీ ఏజెంట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్య నగరాలు, పట్టణాలు తిిగి రద్దయిన నోట్లను ఖత్రీకి అందిస్తున్నారు. వాటిని ఖత్రీ హైదరాబాదుకు పంపించి కొత్త నోట్లుగా మారుస్తున్నారు. నోట్లను మార్చుకోవడానికి వచ్చేవారి నుంచి దాదాపు 40 శాతం కమిషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో నోట్లను మార్చే వారి కమిషన్ 25 శాతం అయితే, మిగతాది ఖత్రీకి దక్కుతుంది.

   డంప్ ఉప్పు ఇలా అందింది...

  డంప్ ఉప్పు ఇలా అందింది...

  గత నెల మీరట్‌లో ఓ బిల్డర్ ఇంట్లో రూ.25 కోట్ల పాత నోట్లను పోలీసులు పట్టుకున్నారు. ఆ సమయంలో అతను హైదరాబాదు దళారీల గురించి సమాచారం అందించాడు. దాంతో వారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఖత్రీతో కలిసి వారు చేస్తున్న దందా గురించి వారికి సమాచారం తెలిసింది.

   ఖత్రీని అలా పట్టుకు్నారు.

  ఖత్రీని అలా పట్టుకు్నారు.

  సమాచారం తెలియడంతో జాతీయ దర్యాప్తు సంస్థ, ఆర్బీఐ సహకారంతో పోలీసులు ఖత్రీ ముఠాను నోట్లతో సహా పట్టుకున్నారు. వారిపై ఐపిసి సెక్షన్లు 420, 511, 120బి, స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ యాక్ట్ 2017 కింద కేసులు నమోదు చేసినట్లు కాన్పూర్ జోన్ ఐి ఆలోక్ సింగ్ చెప్పారు. గత ఆరు నెలల్లో తాము ఖత్రీకి, యాదవ్ అనే వ్యక్తికి మధ్య జరిగిన రూ.15 కోట్ల నగదు మార్పిడి చేసినట్లు ఏజెంట్లు తెలిపారని, పాత నోట్లు నోట్లను మారుస్తన్నట్ల మాత్రం చెప్పలేదని ఆయన అన్నారు.

   తెలుగు వ్యక్తే చెప్పాడు...

  తెలుగు వ్యక్తే చెప్పాడు...

  అరెస్టయినవారిలో ఓ తెలుగు వ్యక్తి ఓ కంపెనీ పేరు చెప్పాడని, ఆ సంస్థ ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఎన్నారైలు ఉన్నారని అలోక్ సింగ్ చెప్పారు. అయితే ఎన్నారైలు తమ వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకునే గడువు కూడా ముగిసిపోయినందు వల్ల ఆ ముఠా నోట్లను ఎలా మార్పిడి చేస్తోందో తెలుసుకోవాల్సి ఉందని అన్నారు.

   ఓ డైరీ కూడా దొరికింది...

  ఓ డైరీ కూడా దొరికింది...

  నోట్ల స్వాధీనం చేసుకు్న ఇంట్లోనే ఆదాయం పన్ను శాఖ అధికారులకు ఓ డైరీ కూడా దొరికినట్లు తెలుస్తోంది. ఈ నెల 4వ తేదీన హైదరాబాదులో కోటీ రూపాయలు, 10వ తేీదన 74.71 లక్షల రూపాయల పాత నోట్లను పట్టుకుని ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

  English summary
  In a joint raid with the National Investigation Agency (NIA), Uttar Pradesh Police is learnt to have unearthed old currency notes estimated to be worth Rs 97 crore in Kanpur.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X