ఆరు నెలలుగా మారు తండ్రి అత్యాచారం: గర్భం దాల్చిన కూతురు

హైదరాబాద్: ఓ వ్యక్తి వావివరుసలు మరిచి అఘాయత్యానికి పాల్పడ్డాడు. 15 ఏళ్ల వయస్సుగల కూతురిపై మారు తండ్రి అత్యాచారం చేశాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ సంఘటన సికింద్రాబాదులోని తిరుమలగిరి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎసిపి ఇందుకు సంబంధించిన వివరాలు అందించారు.

మొదటి భర్త వదిలేయడంతో బిహార్‌కు చెందిన మరో వ్యక్తిని మహిళ వివాహం చేసుకుంది. వీరు గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. మద్యం మత్తులో కూతురిపై మారు తండ్రి రామావతార్ ఠాకూర్ (40) ఆరు నెలల నుంచి అత్యాచారం చేస్తున్నాడు. దాంతో బాలిక అనారోగ్యం బారిన పడింది.

old man was booked for allegedly raping

ఆమెను వైద్యుల వద్దకు తీసుకెళ్లగా పరీక్షించి నాలుగు నెలల గర్భవతి అని ధ్రువీకరించారు. కూతురిని తల్లి నిలదీయగా అసలు విషయం చెప్పింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

తండ్రి బెదిరించడంతో బాలిక ఆ విషయం బయటకు చెప్పలేదు. జూన్ 23వ తేదీన ఆస్పత్రికి వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+