కిడ్నాపర్ కు చుక్కలు చూపించిన 11 ఏళ్ల బాలిక.. సినిమా రేంజ్ ట్విస్ట్..!

హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. స్కూల్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న బాలికను ఓ ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశాడు. మీ నాన్న ఆటో పంపించాడు అని బాలికకు మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకున్నాడు. నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్తుండగా బాలికకు అనుమానం వచ్చి ఆటో నుంచి దూకేసింది. ఇది గమనించిన స్థానికులు ఏమైందని బాలికను ఆరా తీయగా.. జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆటో డ్రైవర్ ను స్థానికులు చితకబాదారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు.

చిన్నారులపై అఘాయిత్యాలు ఏమాత్రం ఆగడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా కొందరు ఇంకా మృగాల్లానే ప్రవర్తిస్తున్నారు. అభంశుభం తెలియని చిన్నారులపై దాడులకు పాల్పడుతూ వారి నిండి జీవితాన్ని చిదిమేస్తున్నారు. హైదరాబాద్ లోనూ ఇలాంటి ఘటనలు రోజురోజుకూ అధికం అవుతున్నాయి. తాజాగా భాగ్యనగరంలోని పాతబస్తీ ప్రాంతంలో షాకింగ్ ఘటన జరిగింది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ 11 ఏళ్ల బాలిక కిడ్నాప్ ఉదంతం నగరంలో సంచలనంగా మారింది. మహిళలకే కాదు చిన్నారులకు కూడా రక్షణ లేకుండా పోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.

ఏం జరిగింది.. ?

మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్ షాహీ ప్రాంతానికి చెందిన 11 ఏళ్ల బాలిక.. పంజేషా సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. అయితే ఎప్పటిలాగే స్కూల్ ముగియగానే ఇంటికి వెళ్తుంది. అలాగే సోమవారం కూడా పాఠశాల అయిపోగానే సాయంత్రం 4 గంటల 30 నిమిషాల సమయంలో ఇంటి బాట పట్టింది. అయితే మార్గ మధ్యలో షబ్బీర్ అలీ అనే ఆటో డ్రైవర్ చిన్నారి వద్ద ఆటో ఆపాడు. మీ నాన్న ఆటో పంపించాడు.. ఎక్కు ఇంటికి తీసుకెళ్తా అని మాయమాటలు చెప్పాడు. నిజమేనని నమ్మిన ఆ బాలిక ఆటోలో కూర్చొంది.

అలా కొంత దూరం అటూ ఇటూ గల్లీలు తిప్పిన షబ్బీర్ అలీ.. ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్తుండగా బాలికకు అనుమానం వచ్చింది. మా ఇళ్లు ఇటు కాదు అని అరిచింది. అయినా ఆటో డ్రైవర్ లెక్కచేయకుండా ముందుకు కదిలాడు. ఈ క్రమంలో బాలిక ధైర్యం చేసుకుని కిందకు దూకేసింది. దీంతో స్థానికులు అక్కడకు వచ్చి ఏమైందని అడిగారు. బాలిక జరిగిన విషయం చెప్పడంతో ఆటో డ్రైవర్ ను చితకబాదిన స్థానికులు పోలీసులకు అప్పగించారు.

Old Town Ordeal Auto Driver Detained After Kidnapping Minor Girl in Hyderabad

నిందితుడ్ని పోలీసులు మలక్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆటో డ్రైవర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసుపై వివిధ కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+