ట్విట్టర్ లో తెలంగాణ మోత - బీజేపీ వర్సస్ టీఆర్ఎస్ : ప్రధాని రాకతో ట్యాంక్ బండ్ పై...!!
ప్రముఖ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ లో తెలంగాణ అంశాలతో మోత పుట్టింది. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య వార్ నడిచింది. తెలంగాణకు సంబంధించి ఏకంగా నాలుగు అంశాలు ట్విటర్ ట్రెండింగ్‌లో నిలిచాయి. ప్రధాని మోదీ.. ప్రతిష్ఠాత్మకమైన సమతామూర్తి రామానుజాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సమయంలోనే ట్విట్టర్ వేదికగా రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ, ఇక్రిశాట్, 'షేమ్ ఆన్ కేసీఆర్', 'ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ' పేరుతో పోస్టింగ్ లు వేలాదిగా దర్శనమిచ్చాయి. '

స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ట్రెండింగ్
స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ' హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్‌లోనూ అత్యధికులు ముచ్చింతల్ లో ప్రధాని మోదీ పాల్గొన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం వేలాది మంది ఫాలో అయ్యారు. దీంతో..ఇది ట్రెండింగ్ గా మారింది. ఇక్రిశాట్‌లో స్వర్ణోత్సవ వేడుకల కార్యక్రమంలోనూ ప్రధాని మోదీ పాల్గొనగా.. ఐదు దశాబ్దాలుగా ఇక్రిశాట్ అందించిన సేవలు, సాధించిన విజయాలను నెటిజన్లు గుర్తుచేసుకున్నారు. 'ఇక్రిశాట్' హ్యాష్‌ట్యాగ్‌తో ఈ అంశం ట్విటర్‌లో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ట్రెండింగ్‌లో నిలిచింది. ఇదే సమయంలో మరో ఆసక్తి కర అంశం పైన ఇటు ప్రదర్శన..అటు సోషల్ మీడియాలో ప్రశ్నలు - కౌంటర్లు కనిపించాయి. రాష్ట్ర మంత్రులు మొదలు.. తెలంగాణకు చెందిన మేధావులు, నెటిజన్లు ఈ హ్యాష్‌ట్యాగ్‌తో ప్రధానిపై ప్రశ్నాస్త్రాలు సంధించారు.

టీఆర్ఎస్ వర్సస్ బీజేపీ
''దేశవ్యాప్తంగా 7 ఐఐఎంలు, మరో 7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 4 ఎన్‌ఐడీలు, 157 వైద్య కళాశాలలు, 84 నవోదయ విద్యాలయాలను మంజూరు చేశారు. తెలంగాణకు మాత్రం గుండుసున్నా'' అంటూ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ట్వీట్ చేశారు. ''బయ్యారం ఉక్కు పరిశ్రమ డిమాండ్‌ను మీకు గుర్తుచేస్తున్నాను'' అని ఎమ్మెల్యే హరిప్రియ, ''తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా అడిగితే ఎవరికీ ఇవ్వట్లేదన్నారు.. కానీ, కర్ణాటకకు, మధ్యప్రదేశ్‌కు ఇచ్చారు. పాలమూరు సంగతేంటి'' అని మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్ ట్వీట్ చేశారు. నిధుల మంజూరులో తెలంగాణపై వివక్షణ ఇప్పుటికైనా వీడండంటూ మంత్రి తలసాని, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారానికి కేంద్ర నిధులేవి అంటూ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు.

యువత నిరసన
32 వేల మందికిపైగా రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, పసుపు బోర్డు, ప్రాజెక్టులకు జాతీయ హోదా, బీజేపీ పాలిత రాష్ట్రాల మాదిరిగా నిధుల విడుదల డిమాండ్, తదితర అంశాలపై ట్విటర్‌లో పోస్టులు చేయడం గమనార్హం. ఇదే హ్యాష్‌ట్యాగ్, ఇవే డిమాండ్లతో.. ట్యాంక్‌బండ్‌పై యువకులు భారీ బ్యానర్‌ను ప్రదర్శించారు. ఇక, బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య వార్ నడిచింది. తొలుత టీఆర్‌ఎస్ మద్దతుదారులు విమర్శలు మొదలుపెట్టగా ప్రతిగా బీజేపీ తరఫున ప్రతి విమర్శలను కొనసాగించారు. ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ హ్యాష్ ట్యాగ్‌తో టీఆర్‌ఎస్ నేతలు.. షేమ్ ఆన్ యూ కేసీఆర్ హ్యాష్‌ట్యాగ్‌తో బీజేపీ నేతలు వేడి పుట్టించారు. రాష్ట్రం పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందంటూ 20 వేలకు పైగా ట్వీట్లతో 'ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ' హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ట్రెండ్ అయింది.

షేమ్ ఆన్ యూ కేసీఆర్ హాష్ ట్యాగ్
కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వట్లేదని నేతలు ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ట్వీట్లకు బీజేపీ దీటుగా బదులిచ్చింది. ప్రధానికి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ రాకపోవడంపై విమర్శలు గుప్పించింది. ప్రధాని మోదీ ని ముఖాముఖి ఎదుర్కోలేక కేసీఆర్ ముఖం చాటేశారా అని నేతలు ప్రశ్నిం చారు. షేమ్ ఆన్ యూ కేసీఆర్ హాష్ ట్యాగ్‌తో సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ తీరుపై వరుస ట్వీట్లతో విమర్శల వర్షం కురిపించారు.












Click it and Unblock the Notifications