రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
రంగారెడ్డి: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఘన్షిమియాగూడ వద్ద బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.












Click it and Unblock the Notifications