మీర్జాగూడలో మరో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి, ఒకరికి తీవ్రగాయాలు !!

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్న మీర్జాగూడ వద్ద మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గత ఏడాది ఇదే ప్రాంతంలో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు సహా 21 మంది దుర్మరణం చెందగా.. మరికొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ దుర్ఘటనను మరువకముందే అదే ప్రాంతంలో ఇప్పుడు మరో ప్రమాదం చోటుచేసుకుంది. కారు చెట్టును ఢీ కొన్న ఘటనలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ వరుస ప్రమాదాలతో స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విషాద వాతావరణం నెలకొంది.

అసలేం జరిగిందంటే..?

మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు తీవ్ర గాయాలపాలయ్యారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా ICFAI యూనివర్సిటీ, MGITలకు చెందిన ఐదుగురు విద్యార్థులు పోలీసులు గుర్తించారు.

one-more-road-accident-at-mirjaguda-thar-car-hit-tree-and-4-dead-in-telangana

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కారులో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలానే మరో యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను కూడా ఆస్పత్రికి తరలించి వైద్య సహాయం అందిస్తున్నారు.

మృతి చెందిన నలుగురు విద్యార్థులను సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్‌లుగా పోలీసులు గుర్తించారు. కోకాపేట్‌లో బర్త్‌డే పార్టీ ముగించుకుని, ఒక స్నేహితుడిని డ్రాప్ చేసి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటన కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాన్ని తొలగించి.. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అలానే ఈ సంఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+