ప్రేమ పేరుతో మోసం: ఏడాది జైలు, జరిమానా

హైదరాబాద్: ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసిన యువకుడికి సంవత్సరం జైలు, రూ.వెయ్యి జరిమానా, మరో ఐదుగురికి జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా తాండూరు మున్సిఫ్‌ కోర్టు మెజిస్టట్‌ యూనిస్‌ గురువారం తీర్పుచెప్పినట్లు బషీరాబాద్‌ ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తెలిపారు.

బషీరాబాద్ మండల పరిధిలోని దామర్‌చెడ్‌ గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఈ క్రమం లో 2012 నవంబర్‌ 12న బాధితురాలి తండ్రి బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అప్పట్లో కేసు నమోదు చేశారు.

 One year jail for cheating a girl

ఈ కేసుపై తాండూరు మున్సిఫ్‌ కోర్టులో ట్రయల్‌ కొనసాగగా, గురువారం తుది విచారణకు వచ్చింది. దీంతో మెజిస్టట్‌ కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం యువతిని మోసం చేసిన యువకుడు జోగి శ్రీధర్‌కు ఏడాది జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది.

అలాగే ఇదే కేసులో నిందితులుగా ఉన్న తల్లిదండ్రులు శంకర్‌, శారదమ్మ, రాజు, లాలు, మారుతిలకు ఒక్కొక్కరికి మెజిస్ట్రేట్‌ రూ.500 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఐదుగురి జరిమానా చెల్లించినట్లు, శిక్షపడిన శ్రీధర్‌ను జైలుకు తరలించినట్లు ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+