భక్తులకు గుడ్‌న్యూస్: భద్రాద్రి రాములోరి సేవలు ఇక ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోండి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రముఖ ఆలయ సేవలు అన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. భద్రాద్రి రామయ్య సన్నిధిలోని ఆలయంలో జరిగే అన్ని పూజలు, సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వెచ్చినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి సాయంత్రం వరకు జరిగే అన్ని సేవల్లో,పూజల్లో భక్తులు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకుని.. నేరుగా పూజా కార్యక్రమంలో పాల్గొనవచ్చనన్నారు.
ఈ సేవలను www.bhadradritemple.telangana.gov.in వెబ్‌సైట్ సందర్శించి.. భక్తలకు నచ్చిన సమయంలో కావల్సిన సేవను బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఆన్‌లైన్‌లో ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయం కల్పించారని అన్నారు. భద్రాద్రి రామయ్య ఆలయ ఆన్‌లైన్ టిక్కెట్లను ఈవో మంగళవారం ప్రారంభించారు. ఈ సేవల కోసం గత రెండు నెలలుగా ఆలయ సిబ్బందికి శిక్షణ ఇప్పించి అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు.

ఆన్‌లైన్‌లో భద్రాచలం రామాలయంలో జరిగే నిత్యకళ్యాణం, ప్రత్యేక దర్శనం, అర్చకులు, వెండి రథ సేవ, దర్బారు సేవ వంటి పూజల్లో పాల్గొనవచ్చునని ఈవో తెలిపారు. అంతేగాక, భక్తులు ఆలయానికి సంబంధించిన అన్నదానానికి, గోశాలకు, ఆలయ అభివృద్ధికి విరాళాలు ఇవ్వాలనుకున్న దాతలు ఆన్‌లైన్ ద్వారా చెల్లించవచ్చునని తెలిపారు.
భద్రాద్రికి వచ్చే భక్తులంతా జులై 4 నుంచి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. రామయ్య సేవలను నేరుగా, ఆన్‌లైన్ ద్వారా ఈ సేవలను వినియోగించుకొని.. స్వామివారిని దర్శించుకోవచ్చని అన్నారు. భద్రాద్రి టెంపుల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఆన్‌లైన్ బుకింగ్స్‌లోకి వెళ్లి భక్తులకు కావలిసిన సేవను బుక్ చేసుకోవచ్చని వివరించారు.
వెబ్‌సైట్‌లో ఏ సమయంలో ఏ పూజ జరుగుతుందో.. సేవ లేదా పూజా టికెట్ ధరలను అందుబాటులో ఉంచారు. రాబోయే కాలంలో భక్తులకి మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకు వస్తామని తెలిపారు. భద్రాద్రి సీతారాముల వారి సేవలు ప్రజలందరికీ అందాలనే ఉద్దేశంతో ఆలయానికి కొత్త వెబ్‌సైట్ రూపొందించి.. ఆన్‌లైన్ సేవలను, పూజలను ప్రారంభించామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ సేవలను తొందరగా భక్తుల ముందుకు తీసుకువచ్చామన్నారు.












Click it and Unblock the Notifications