సోషల్ మీడియా వీడియోపై విజయారెడ్డి భగ్గు: ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి తనను వేదిక మీద నెట్టేసినట్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన వీడియోపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకురాలు విజయారెడ్డి భగ్గుమన్నారు. దానిపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తనను, మంత్రిని అప్రతిష్టపాలు చేయడానికి వీడియోను ఫోర్జ్ చేసి, అప్‌లోడ్ చేశారని ఆమె ఆరోపించారు. నాయని నర్సింహా రెడ్డి తనను నెట్టేయలేదని, బిజెపి శానససభ్యుడు చింతల రామచంద్రారెడ్డితో వాదనకు దిగినప్పుడు శాంతపరచడానికి మాత్రమే ప్రయత్నించారని ఆమె వివరించారు.

ఈ సంఘటన ఈ నెల 8వ తేదీన పట్టాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా హైదరాబాదులోని పంజగుట్టలో జరిగిందని ఆమె చెప్పారు. బిజెపి శానససభ్యుడు దాన్ని హైజాక్ చేసి, తనను వేదిక నుంచి దిగిపోవాలని చెప్పారని, తాను దానికి అభ్యంతరపెట్టానని, దాంతో నాయని నర్సింహా రెడ్డి తనను శాంతపరచడానికి ప్రయత్నించారని ఆమె వివరించారు.
తెలుగుదేశం పార్టీ ఫేస్‌బుక్ పేజ్ ఆడ్మినిస్ట్రేటర్స్, ప్రాంతీయ టీవీ చానెల్ కావాలని దానని యూట్యూబ్‌లో పెట్టారని ఆమె అన్నారు. తాను వారం క్రితం చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్సన చేయడంతో ఆ పార్టీవారు తనను అప్రతిష్టపాలు చేయాలని అనుకుంటున్నారని ఆమె విమర్ఇశంచారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ విధమైన కేసు కూడా నమోదు చేయలేదు.












Click it and Unblock the Notifications