కేసీఆర్ డిసైడెడ్, పార్టీ ముఖ్యులకు అలర్ట్ - తాజా సర్వేలతో క్లారిటీ..!!

తెలంగాణలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. మూడు ప్రధాన పార్టీలో ఎన్నికల బరిలో పోటీ పడుతున్నా..బీఆర్ఎస్ వర్సస్ కాంగ్రెస్ అన్నట్లుగా యుద్దం కనిపిస్తోంది. ఇప్పటికే పలు సర్వే సంస్థలు తెలంగాణలో ఎవరు గెలుస్తారనే అంచనాలు వెల్లడించాయి. బీఆర్ఎస్ - కాంగ్రెస్ గెలుపు మాదంటే మాదని ధీమాగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ ఫలితంపైన అంచనాకు వచ్చారు. పార్టీ నేతలను అలర్ట్ చేసారు.

హ్యాట్రిక్ గెలుపు లక్ష్యంతో: తెలంగాణలో మరోసారిగా గెలిచి హ్యాట్రిక్ సాధించాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం. ఈ సారి ఎలాగైనా గెలుస్తామనేది కాంగ్రెస్ నేతల ధీమా. ఇప్పటికే కేసీఆర్ ఎన్నికల్లో తమ అభ్యర్దుల విజయం కోసం సుడిగాలి పర్యటన చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర నేతలు తెలంగాణలో గెలుపు కోసం ప్రధానంగా ఫోకస్ చేసారు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే సీఎం కేసీఆర్ అప్రమత్తం అయ్యారు.

Opinion: CM KCR confident that his party will emerge victorious in 95 to 105 seats, Will he Succeed

బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలు..ఆ పార్టీలో పరిణామాలను నిశితంగా గమనించారు. అవసరమైన వ్యూహాలను సిద్దం చేసుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ తమ తుది జాబితాలను విడుదల చేయలేదు. అటు కేసీఆర్ ఎన్నికల సభల్లో గతం కంటే భిన్నంగా కూల్ గా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఓటర్లకు తమ పార్టీ గెలుపు అవసరం ఏంటో అర్దం అయ్యేలా వివరిస్తున్నారు.

అనుకూలంగా సర్వేలు: సీఎం కేసీఆర్ తాను తొలి నుంచి విశ్వసించే సర్వే సంస్థలతో పలు కోణాల్లో సర్వేలు చేయించారు. తన పార్టీకి అనుకూలతలు- ప్రతికూలతలు గుర్తించారు. తన రాజకీయ అనుభవంతో వాటిని సరిదిద్దుకుంటూ ప్రత్యర్ధులను ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రచారం తో పాటుగా ఎన్నికల వ్యూహాల్లో కేసీఆర్ ఢీ కొట్టే నేతలు కాంగ్రెస్ లో లేరనే అభిప్రాయం ఉంది. జాతీయ సర్వేల్లోనూ కేసీఆర్ కే విజయం ఖాయమనే రిపోర్టులు వస్తున్నాయి.

తాజాగా జాతీయ న్యూస్‌ చానల్‌ జీ న్యూస్‌-మెట్రిజ్‌తోపాటు జీ తెలుగు న్యూస్‌ వెబ్‌ చానల్‌ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌లో సైతం మరోసారి వెల్లడైంది. రాష్ట్రంలోని మొత్తం 119 సీట్లకుగానూ బీఆర్‌ఎస్‌ పార్టీ 43 శాతం ఓట్లతో 70-76 సీట్లు కైవసం చేసుకొంటుందని తేలింది. కాంగ్రెస్‌ 36 శాతం ఓట్లతో 27-33 సీట్లు,బీజేపీ 13 శాతం ఓట్లతో 5-8 సీట్లు, ఎంఐఎం 4 శాతం ఓట్లతో 6-7 సీట్లు, ఇతరులు 4 శాతం ఓట్లతో 0-1 సీటు సాధిస్తారని వెల్లడైంది.

పార్టీ నేతలను అప్రమత్తం చేస్తూ: సీఎంగా మళ్లీ కేసీఆర్‌కే పట్టం కడతామని 36 శాతం మంది వెల్లడించారు. ఇప్పటికే ప్రముఖ సర్వేలన్నీ తెలంగాణలో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడబోతున్నదని అంచనా వేస్తున్నాయి. అయితే, కాంగ్రెస్ బలం గతం కంటే పెరిగిందని తేల్చి చెబుతున్నాయి. దీంతో, అప్రమతతమైన కేసీఆర్ పార్టీ శ్రేణులను అలర్ట్ చేస్తున్నారు. ఎక్కడా అతివిశ్వాసం వద్దని స్పష్టం చేస్తున్నారు.

కొన్ని నియోజకవర్గాల్లో నువ్వా -నేనా అన్నట్లుగా పోటీ ఉందని గుర్తించి..అక్కడ ట్రుబల్ షూటర్స్ ను మోహరిస్తున్నారు. వార్ రూమ్ ఏర్పాటు చేసి కీలక నియోజకవర్గాల్లో గ్రౌండ్ రియాల్టీని ఎప్పటి కప్పుడు ఆరా తీస్తున్నారు. కేటీఆర్ - హరీష్ కు ఎక్కడ ఏం చేయాలో నిర్దేశిస్తున్నారు. ఇక..ప్రచారం రెండో విడత ప్రచారంలో లో కేసీఆర్ ప్రతిపక్షాల పైన దూకుడు ప్రదర్శించే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+