Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం కేసీఆర్ సక్సెస్ లో ఆ నిర్ణయం - కష్టాలకు ఎండ్ కార్డు, ఫుల్ సపోర్ట్..!!

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికా బద్దంగా తన నిర్ణయాలు అమలు చేస్తున్నారు. తెలంగాణ స్థితి గతులు..ప్రజల సమస్యలపైన పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్..ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తరువాత ఒక్కో సమస్యకు పరిష్కారం చూపిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో ముఖ్యంగా సాగు..తాగు నీటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆ దిశగా కేసీఆర్ ఆలోచనల్లో పుట్టుకొచ్చిందే మిషన్ భగీరథ. ప్ర‌తి జిల్లాలోని ప్రతి పల్లెకు, ప్రతితండాకు స్వచ్ఛమైన తాగునీరు అందించే మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కానికి రూ.44,933.66 కోట్ల అంచనా వ్యయంతో శ్రీ‌కారం చుట్టారు.

మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం ద్వారా:దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం మంచినీటి స‌ర‌ఫ‌రా కోసం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింది. మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం ద్వారా ప్ర‌తి ఇంటికీ ప్ర‌తి రోజు సుర‌క్షిత నీరు అందిస్తోంది. ఫ్లోరైడ్ తో పాటు, తాగునీటి క‌ట‌క‌టకు నిల‌యంగా మారిన తెలంగాణ ప‌ల్లెల‌కు మిష‌న్ భ‌గీర‌థ వ‌రంగా మారింది.

Opinion: CM KCR Dream project Mission Bhagiratha which turned into a role model for the country to emulate

గోదావరి, కృష్ణా జలాలను శుద్ధి చేసి ప్రతీ రోజు 24 వేల ఆవాస ప్రాంతాల‌కు అందించే ప‌థ‌కాన్ని కేసీఆర్ ప్ర‌భుత్వం అంచ‌నా వ్య‌యం కంటే 18 శాతం త‌క్కువ‌కే పూర్తి చేసింది. అనుకున్న స‌మ‌యంలోని ప‌నులు పూర్తి చేయ‌డంతో పాటు, రూ.8,033.66 కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ ప్ర‌భుత్వం ఆదా చేసింది. మిషన్ భగీరథ పైలాన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ 2016, ఆగస్టు 7 గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం లోని కోమటిబండలో ఆవిష్కరించారు.

కష్టాల నుంచి మహిళలకు విముక్తి:దీంతో దేశంలోనే ఇంటింటికీ నల్లా సౌకర్యం పొందిన తొలి నియోజకవర్గంగా గజ్వేల్ చరిత్ర సృష్టించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి 100 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 150 లీటర్లు తాగునీరు అందించాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. పారిశ్రామిక అవసరాల కోసం సుమారు 4 టీఎంసీలు స‌ర‌ఫరా చేసేలా మిష‌న్ భ‌గీర‌థ ప్రాజెక్టులో ప్రణాళిక రూపొందించారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 150 నీటి శుద్ధి ప్లాంట్లు, 62 పంపింగ్ స్టేషన్లు, 35,573 ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్లు, 27 ఇంటెక్ వెల్స్ నిర్మించారు.

బిందెడు నీటి కోసం అష్ట‌క‌ష్టాలు ప‌డే మహిళలకు ఆ ఇబ్బందులు తొల‌గిపోయాయి. రాబోయే 30 ఏళ్ల వరకు పెరిగే జనాభా అవసరాలు తీర్చే విధంగా ఈ ప్రాజెక్టుకు రూప‌క‌ల్ప‌న చేశారు. మిషన్‌ భగీరథతో రాష్ట్రంలో ఫ్లోరైడ్‌ పీడ పూర్తిగా అంతమైంది. మిషన్‌ భగీరథకు రూ.19 వేల కోట్ల సాయం చేయాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినా కేంద్రం మాత్రం మొండిచేయి చూపించింది.

Opinion: CM KCR Dream project Mission Bhagiratha which turned into a role model for the country to emulate

మంచినీటి స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం:ఉమ్మ‌డి ఏపీలో మంచినీటికోసం తెలంగాణ ప‌ల్లెలు వ్యవసాయ బోరుబావులు, వాగులు, వంక‌లు, చెలిమెలవైపు వెళ్లేవారు. కేసీఆర్ ప్ర‌భుత్వం మిషన్‌ భగీరథ పథకంతో ప్రస్తుతం మెదక్‌ జిల్లాలోని 469 గ్రామాల తోపాటు నాలుగు మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా శుద్ధమైన తాగునీరు సరఫరా అవుతుంది. నీళ్ల ట్యాంకర్ లు, వీధి నల్లాల వద్ద మహిళలు కుస్తీలు ప‌ట్ట‌డం, ఖాళీ బిందెలతో రోడ్లపై ధర్నాలు చేయడం ఎక్క‌డా క‌నిపించ‌కుండాపోయాయి.

హైదరాబాద్ మహానగరంలో తాగు నీటి సమస్య తలెత్తకుండా రూ.13,546 కోట్ల వ్యయంతో నూతనంగా అదనపు పైప్ లైన్లు, రిజర్వాయర్లనిర్మాణం చేప‌ట్టింది రాష్ట్ర ప్ర‌భుత్వం. మహిళల ఆత్మగౌరవంతో ముడిపడిన మంచినీటి స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపించిన ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ చ‌రిత్ర‌లో నిలిచిపోనున్నారు.

హైదరాబాద్ నగరానికి వరంగా:మ‌రో 50 సంవత్సరాల పాటు తాగునీటి క‌ష్టాలు త‌లెత్త‌కుండా కృష్ణా, గోదావరి జలాలను స‌ర‌ఫ‌రా చేసేలా తెలంగాణ ప్ర‌భుత్వం కొత్త‌గా సుంకిశాల ప్రాజెక్టును చేప‌ట్టింది. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి నిరంతరం నీటి సరఫరా జరిగే విధంగా న‌ల్ల‌గొండ జిల్లాలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్ర‌భుత్వం నిధులు విడుద‌ల చేసింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న‌ప్పుడు హైద‌రాబాద్‌ నగరంలో 8.15 లక్షల నల్లా కనెక్షన్ లు ఉండగా, నేడు 13.17 లక్షల కు పెరిగాయి.

రూ. 815 కోట్ల వ్య‌యంతో నెలకు ఉచితంగా 20 వేల లీటర్ల వరకు నీటి సరఫరా చేస్తు దేశంలోనే ఆద‌ర్శ రాష్ట్రంగా నీతి ఆయోగ్ ప్ర‌శంస‌లు అందుకుంది ప్ర‌భుత్వం. ప్రస్తుతం కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 24 గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజలకు ప్రతిరోజు 602 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని సరఫరా చేస్తున్న‌ట్లు జ‌ల‌మండ‌లి అధికారులు వెల్ల‌డించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+