హెల్త్ టెక్ కేరాఫ్ హైదరాబాద్ - కేటీఆర్ స్పెషల్ ఫోకస్: పెట్టుబడుల వెల్లువ..!!
హైదరాబాద్ మరో అరుదైన ఫీట్ సాధించింది. లైఫ్‌సైన్సెస్ రంగంలో హైదరాబాద్ అగ్రగామిగా నిలిచింది
తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరో అరుదైన ఫీట్ సాధించింది. లైఫ్‌సైన్సెస్ రంగంలో హైదరాబాద్ అగ్రగామిగా నిలిచింది. ఔషధ ఉత్పత్తిలో ఆసియాలోనే హైదరాబాద్ అతిపెద్ద నగరంగా ఆవిర్భవిస్తోంది. ఫార్మా రంగంలో హైదరాబాద్‌కు 7 ఏళ్లలో రూ.25 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఫార్మా రంగానికి హైదరాబాద్ నగరం కేరాఫ్‌గా నిలుస్తున్న నేపథ్యంలో తాజాగా జరిగిన బయో ఏషియా సదస్సు ద్వారా కొత్త మలుపు తీసుకుంది. భారీగా పెట్టుబడులకు వేదికగా నిలిచింది. ప్రపంచంలోని టాప్-10 ఫార్మా కంపెనీల్లో నాలుగు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ ఫార్మాసిటీ వరల్డ్ లార్జెస్ట్ హబ్‌గా అవతరిస్తున్న వేళ పెట్టుబడుల వెల్లువ కొనసాగింది.

హైదరాబాద్‌కు 7 ఏళ్లలో రూ.25 వేల కోట్లు
లైఫ్‌సైన్సెస్ రంగంలో ప్రపంచ హబ్‌గా హైదరాబాద్ అవతరించింది. ప్రపంచపు హెల్త్ టెక్ మక్కాగా హైదరాబాద్‌ను నిలిపేందుకు తాము ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. ప్రపంచం లోనే గొప్ప లైఫ్‌సైన్సెస్ కేంద్రంగా ఇప్పటికే వెలుగొందుతున్నప్పటికీ ఇంతటితో ఆగిపోకుండా లైఫ్‌సైన్సెస్ రంగానికి మరో కొత్త ఆకృతినిచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌కు 7 ఏళ్లలో రూ.25 వేల కోట్లు వచ్చాయని కేటీఆర్ వెల్లడించారు. కేటీఆర్ ఫార్మాకు హైదరాబాద్ ప్రపంచంలోనే అనుకూల వేదికగా మార్చేందుకు పలు నిర్ణయాలుఅమలు చేస్తున్నారు. 15ఏళ్ల క్రితం తమ కంపెనీ ఇక్కడ ఒక కెపాసిటీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు వచ్చిందని, ఇప్పుడు కంపెనీ కార్యకలాపాలు 10 రెట్లు పెరిగాయని ఫార్మా దిగ్గజాలు హైదరాబాద్ లో అవకాశాల గురించి చెప్పుకొచ్చారు. హైదరాబాద్ నగరంలో 20కి పైగా లైఫ్‌సైన్సెస్, మెడ్‌టెక్ ఇంక్యుబేటర్లు ఉన్నాయి. ప్రపంచంలోని టాప్-10 ఫార్మా కంపెనీల్లో నాలుగు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

ఫార్మా పరిశ్రమలో పెట్టుబడుల వెల్లువ
హైదరాబాద్ వేదికగా జరిగన బయో ఫార్మా సదస్సులో పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులు మంత్రి కేటీఆర్ తో చర్చలు చేసారు. పెట్టుబడుల వివరాలను వెల్లడించాయి. రూ 500 కోట్లతో ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్ సంస్థను నెలకొల్పనున్నట్లు ప్రఖ్యాత ఎస్ జీడీ, కోర్నింగ్ సంస్థలు ప్రకటించాయి. ఫాక్స్ లైఫ్ సైన్సెస్ సంస్థ ఇప్పటికే రూ 200 కోట్లతో హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. తాజాగా మరింత విస్తరణకు నిర్ణయించింది. తెలంగాణలో మరో 20 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రముఖ సంస్థ పీఎస్ఎల్ ప్రకటించింది. అమెరికాకు చెందిన జూబిలెంట్ సంస్థ వెయ్యి కోట్లు, ఫ్రాన్స్ సంస్థ సనోఫి రూ 250 కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. పరిశ్రమకు చెందిన ప్రముఖలతో బయో ఏషియో సదస్సులో భాగంగా మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పరిశ్రమల స్థాపన.. విస్తరణకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతాయని హామీ ఇచ్చారు.

100బిలియన్ డాలర్ల లక్ష్యంగా..
ఫార్మి పరిశ్రమలో పెట్టుబడులు..విస్తరణ దిశగా మంత్రి కేటీఆర్ కీలక హామీలు ఇచ్చారు. నిరంతం పరిశ్రమ ప్రతినిధులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత సాధించిన పురోగతిని వివరించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 2030నాటికి లైఫ్‌సైన్సెస్ రంగం విలువ రెట్టింపు చేసి 100బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నామని చెప్పారు. 2022లోనే 80బిలియన్ డాలర్ల విలు వకు చేరుకున్నామని కేటీఆర్ వివరించారు. దీంతో లక్ష్యాన్ని సవరించి 2030 నాటికి 250 బిలియన్ డాలర్ల విలువకు పెంచామని చెప్పుకొచ్చారు. 100 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని 2025లోనే చేరుకోగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. లైఫ్‌సైన్సెస్ రంగం గడిచిన రెండేళ్లలో 23 శాతం వృద్ధి నమోదు చేసుకుందని గణాంకాలతో వెల్లడించారు. తెలంగాణ ఇప్పటికే లైఫ్‌సైన్సెస్, ఫార్మా రంగ ఎకో సిస్టమ్‌కు నిలయంగా ఉందన్నారు. ప్రపంచంలోనే మూడింట ఒక వంతు వ్యాక్సిన్ల ఉత్పత్తి తెలంగాణలో జరుగుతున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం పైన ఫార్మా దిగ్గజాలు సంతోషం వ్యక్తం చేసారు. పెట్టుబడులు..విస్తరణ..వాణిజ్యం ద్వారా హెల్త్ టెక్ మక్కాగా హైదరాబాద్ గా నిలుస్తోంది.












Click it and Unblock the Notifications