Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉద్యోగుల సంక్షేమంలో తొలి స్థానంలో తెలంగాణ ప్రభుత్వం..!!

ఉద్యోగులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. పలు కీలక నిర్ణయాలు అమలు చేస్తోంది.

ఉద్యోగుల సంక్షేమం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోంది. కాంట్రాక్ట్‌ వ్యవస్థకు చరమగీతం పాడింది. కొత్త ఈహెచ్‌ఎస్‌ విధానం అమలుకు నిర్ణయించింది. కొత్త ఉద్యోగాల నియామకాల్లో స్థానికులకే 95 శాతం అమలు చేస్తోంది. రాష్ట్ర పాలనలో..సంక్షేమ ఫలాలు అందించటంలో ఉద్యోగుల భాగస్వామ్యం కీలకం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయం నుంచి ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాల అమల్లోనూ వారిదే కీలక భూమిక. దీంతో..వారికి గుర్తింపు ఇస్తూ వేతనాలు..సంక్షేమం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణ ఉద్యోగులు దేశంలోకెల్లా అత్యధిక వేతనాలు పొందుతున్నవారిగా గుర్తింపు పొందారు.

ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత

ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత

ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార పగ్గాలు చేపట్టిన సమయం నుంచి ఉద్యోగుల విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఆర్సీ ప్రకటన సమయంలోనూ ఉదారంగా వ్యవహరించారు. తెలంగాణ ఉద్యోగులు ప్రస్తుతం దేశంలోనే అత్యధిక వేతనాలు అందుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన జీతాలు అందుతున్నాయి. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆశా, అంగన్ వాడీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలోనూ కీలక నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ఫిట్ మెంట్ వంటి నిర్ణయాలను రెగ్యులర్ ఉద్యోగులతో పాటే అమలు అందేలా నిర్ణయాలు అమలవుతున్నాయి. ఉద్యోగ - ఉపాధ్యాయల కోసం కొత్త ఈహెచ్‌ఎస్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఎంప్లాయిస్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ను ఏర్పాటు చేసి ఇందులో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులు, రిటైర్డ్‌ ఉద్యోగుల ప్రతినిధులను భాగస్వామ్యులుగా చేర్చుతూ ప్రభుత్వం తాజాగా తమ నిర్ణయం ప్రకటించింది.

కాంట్రాక్ట్‌ వ్యవస్థకు చరమగీతం

కాంట్రాక్ట్‌ వ్యవస్థకు చరమగీతం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అమలు చేస్తోంది. కాంట్రాక్ట్‌ వ్యవస్థకు చరమగీతం పాడింది. రాష్ట్రంలోని కాంట్రాక్ట్‌ ఉద్యోగులను ఏప్రిల్‌ నెల నుంచి క్రమబద్ధీకరించనున్నట్లు మంత్రి హరీష్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పనిచేస్తున్నవారిని ఏప్రిల్‌ 1 నుంచి శాశ్వత ఉద్యోగులుగా పరిగణించనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా దాదాపు 11 వేల మందికి ఈ నిర్ణయం ద్వారా మేలు జరగనుంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే వీరి రెగ్యులరైజేషన్ గురించి కేసీఆర్ హామీ ఇచ్చారు. నాడు ఇచ్చిన హామీని ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తోంది. దీని పైన కాంట్రాక్టు ఉద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. దశాబ్దాల కాలంగా శ్రమదోపిడీకి గురవుతున్నా కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 2014 జూన్‌ 2కు ముందు పూర్తిస్థాయి కాంట్రాక్ట్‌ పద్ధతిలో నెలవారి పారితోషికాన్ని పొందుతున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు మార్గదర్శకాలు జారీచేసింది.

95 శాతం ఉద్యోగాలు స్థానికులకే

95 శాతం ఉద్యోగాలు స్థానికులకే

ప్రభుత్వం తీసుకున్న మరో సంచలన నిర్ణయంతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయి. గతంలో 60 నుంచి 80 శాతం వరకు స్థానికులకు రిజర్వేషన్లు అమలయ్యేవి. ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయంతో నూతన నియామక విధానం అమల్లోకి వచ్చింది. దీని ద్వారా అటెండర్ స్థాయి నుంచి ఆర్డీవో దాకా అన్ని రకాల నియామకాల్లో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయి. కొత్తగా జరిగే నియామకాలు ఇదే పద్దతిన భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ల వ్యవస్థ రాజ్యాంగంలోని 371 (ఢీ ) ఆర్టికల్‌ కింద రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుదలతో కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులను తెలంగాణ కోసం ప్రత్యేకంగా సాధించారు. తెలంగాణలో 33 జిల్లాలు, 7 జోన్లు, రెండు మల్టీ జోన్లుగా ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో స్థానిక నిరుద్యోగ యువతకు మేలు జరగనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+