బెంగళూరును దాటేస్తున్న హైదరాబాద్ - ఐటీలో ఉద్యోగాలు మూడింతలు..!!
ఇప్పుడు ప్రపంచం చూపు హైదరాబాద్ వైపు మళ్లింది. ఐటీ సిటీ హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. దాదాపు 1,500 ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలకు హైదరాబాద్ చిరునామాగా నిలిచింది. ఐటీ ఉద్యోగుల సంఖ్య 3.60 లక్షల నుంచి 9,05,715 మందికి చేరింది. 2014లో ఐటీ ఎగుమతుల విలువ రూ.57,258 కోట్లు ఉంటే, 2022-23 నాటికి రూ.2,41,275 కోట్లకు విస్తరించింది. గత సంవత్సరంతో పోల్చితే ఎగుమతులలో 31.44 % వృద్ధి సాధించింది.
సీఎం, కేటీఆర్ ప్రత్యేక శ్రద్ద:సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఐటీ పరిశ్రమపైన తొలి నుంచి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. ఫలితంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో హైదరాబాద్ నగరం ప్రచంచాన్ని ఆకర్షిస్తోంది. సిలికాన్‌వ్యాలీగా, ఐటీ క్యాపిటల్‌గా ప్రసిద్ధిగాంచిన బెంగళూరును అధిగమించే దిశగా తెలంగాణ ఐటీ రంగం దూసుకెళ్తున్నది.

యాపిల్, అమెజాన్, సేల్స్‌ఫోర్స్, ఉబర్, మైక్రాన్, స్టేట్‌స్ట్రీట్, డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్, ఫియట్‌క్రిస్లర్, మాస్‌మ్యూచువల్, ఇంటెల్, ప్రొవిడెన్స్, గోల్డ్‌మ్యాన్‌సాచ్స్, జెడ్‌ఎఫ్, యూబీఎస్, పెప్సి వంటి కంపెనీలను ఆకర్షించడంతోపాటు ఫేస్‌బుక్, క్వాలామ్, అక్సెంచర్, వేల్స్‌ఫార్గో, క్సిలినిక్స్, మైక్రోసోఫ్ట్, ఇన్ఫోసిస్, ఒరాకిల్, టీసీఎస్, ఐబీఎం, టెక్‌మహీంద్ర, కాగ్నిజెంట్, విప్రో తమ కార్యకలాపాలను విస్తరించాయి. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో నెలకొల్పిన టీహబ్-1, టీహబ్-2 సాంకేతికరంగ అభివృద్ధిలో సృష్టిస్తున్న అద్భుతాలు ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
మూడింతలు పెరిగిన ఉద్యోగాలు:ఐటీ రంగ విస్తరణ మిగతా రంగాలైన నిర్మాణ, రవాణా, వినోద రంగాలపై సైతం ప్రభావం చూపింది. టైర్-2 నగరాల్లో సైతం ఐటీ టవర్లను నిర్మిస్తూ స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఐటీ శాఖ చర్యలు చేపట్టింది. ప్రపంచ దిగ్గజ సంస్థ అమెజాన్ రూ.20,761 కోట్లతో ఫాబ్‌సిటీ, ఫార్మాసిటీ, చందనవెల్లిలో 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ.500 కోట్లతో స్మార్ట్ డాటా సెంటర్‌ను నెలకొల్పింది. సేల్స్‌ఫోర్స్ సంస్థ రూ.1,119 కోట్లతో విస్తరణ చేపట్టింది. గోల్డ్‌మాన్ శాచ్స్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు ద్వారా 2,500 మందికి ఉద్యోగాలు లభించాయి. అమెరికన్ బీమారంగ కంపెనీ మసాచూసెట్ మ్యూచువల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ రూ.1,000 కోట్లతో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.

బెంగళూరును దాటేస్తూ:ప్రముఖ కంపెనీలకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారింది. కార్పొరేట్ రంగంలోనే ప్రముఖ కంపెనీలు తమ అతి పెద్ద, రెండో అతి పెద్ద క్యాంపస్‌లను ఇప్పటికే ఏర్పాటు చేశాయి.సాఫ్ట్‌వేర్ రంగంలో ఆవిష్కరణలకు కేం ద్రంగా ఉన్న టీహబ్ తరహాలోనే హార్డ్‌వేర్ రంగంలో సైతం నూతన ఆవిషరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద ప్రొటోటైపింగ్ సెంటర్‌ను టీ-వర్క్స్ పేరుతో ఏర్పాటుచేసింది. పైసా ఖర్చు లేకుండా ఆవిష్కర్తలు తమ సరికొత్త ఆలోచనల మేరకు ఉత్పత్తులను ఆవిష్కరించుకోవచ్చు.
అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలైన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, బ్లాక్‌చైన్, క్లౌడ్, డ్రోన్స్, ఐవోటీ, రోబోటిక్స్, స్పేస్‌టెక్నాలజీపై పలు ప్రాజెక్టులను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో కలిసి చేపడుతోంది. టీహబ్ కు వచ్చిన స్పందనతో తెలంగాణ ప్రభుత్వం రూ.400 కోట్లతో 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీహబ్-2ను ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్‌గా భారీస్థాయిలో నిర్మించింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications