తెలంగాణలో కొత్త పెట్టుబడులు, ఉపాధి - కేటీఆర్ యూఎస్ టూర్ లో ఒప్పందాలు..!!
పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ నిలుస్తోంది. మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. అమెరికన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయి. దిగ్గజ కంపెనీలు తమ పెట్టుబడి, విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. తాజాగా తెలంగాణలో భారీ పెట్టుబడులకు సిద్ధమైన సంస్థల వరుసలో కస్టమర్ సర్వీసుల గ్లోబల్ దిగ్గజం వీఎక్స్‌ఐ సొల్యూషన్స్ కూడా చేరింది.
అమెరికాల పర్యటనలో మంత్రి కేటీఆర్ : మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అనేక అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. న్యూయార్క్‌లో ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రకాల వ్యాపారాలు స్థాపించేందుకు తగిన వనరులు కలిగి ఉన్నదని, దేశంలోనే ఒక ఆదర్శ పెట్టుబడి గమ్యస్థానంగా ఎదిగిందని తెలిపారు.

ప్రగతిశీల, పరిశ్రమ-స్నేహపూర్వక విధానాలు, బలమైన ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ తెలంగాణ సొంతమని చెప్పారు. తెలంగాణ 14 ప్రాధాన్యతా రంగాలను గుర్తించిందని వెల్లడించారు. న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం, యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రత్యేకతలను వివరించారు.
ఇన్వెస్ట్ మెంట్ డెస్టినేషన్ గా : ఈ పర్యటన సమయంలో అంతర్జాతీయ సంస్థ బైన్ క్యాపిటల్‌కు చెందిన వీఎక్స్‌ఐ గ్లోబల్ సొల్యూషన్స్ హైదరాబాద్‌లో తమ డెలివరీ సెంటర్‌ను ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ నిర్ణయం ద్వారా విడతల వారీగా పది వేల మందికి ఉపాధి అవకాశం దక్కనుంది. తొలి రెండు మూడేళ్లలోనే దాదాపు అయిదు వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ తో జరిగిన చర్చల్లో నిర్ణయం ప్రకటించారు.
ఈ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికా కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజెల్స్‌లో ఉన్నది. ఈ సంస్థ ఉత్తర అమెరికా, ఆసియా, యూరప్, కరేబియన్‌లోని 42కిపైగా ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో డైనమిక్ బిజినెస్ ఎకో సిస్టమ్ ఉన్న కారణంగానే తాము అక్కడ డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని వీఎక్స్‌ఐ గ్లోబల్ సొల్యూషన్స్ తెలిపింది.

తెలంగాణలో కొత్త పెట్టుబడులు : మంత్రి కేటీఆర్ తన అమెరికా పర్యటనలో భాగంగా గడిచిన ఐదు రోజులుగా న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, హ్యూస్టన్ తదితర నగరాల్లో పర్యటించారు. ఇప్పటికే అనేక దిగ్గజ కంపెనీలు తమ పెట్టుబడి, విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హైదరాబాద్‌లో తమ అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని (ఐడీసీ) ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.
వైద్య పరికరాల ఉత్పత్తి, హెల్త్‌కేర్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెడ్‌ట్రానిక్స్ కూడా రాష్ట్రంలో రూ. 3 వేల కోట్ల పెట్టుబడితో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ)కి సంబంధించి మెడ్‌ట్రానిక్ ఇంజినీరింగ్, ఇన్నోవేషన్ సెంటర్ (ఎంఈఐసీ)ను విస్తరించనున్నట్టు ప్రకటించింది. మంత్రి కేటీఆర్ తన పర్యటనలో భాగంగా ప్రతీ వేదిక పైన తెలంగాణలో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎలా ఎదిగిందీ వివరిస్తున్నారు. భవిష్యత్ లక్ష్యాలను స్పష్టం చేస్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications