తిరుగులేని రాష్ట్రంగా అగ్రబాగాన - స్వశక్తితో పోటీ ఇస్తూ, రోల్ మోడల్ గా..!!

తెలంగాణ రాష్ట్రం ఆర్దికంగా బలోపేతం అవుతోంది. కేంద్రం పైన ఆధార పడటం లేదు. స్వశక్తితో ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి. ఆర్దికంగా బలంగా ఉన్న రాష్ట్రాలకు ధీటైన పోటీ ఇస్తోంది. అంచనాలకు తగ్గినట్లుగా రాబడి సాధించటంలో అనుసరిస్తున్న ప్రణాళికలు సఫలమవుతున్నాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం నుంచి సమస్యలు ఎదురవుతున్నాయి. రాష్ట్రానికి రావాల్సిన వాటాల్లోనూ కోతలు తప్పటం లేదు. ఈ సమయంలో తెలంగాణ పూర్తిగా స్వశక్తి మీదనే నమ్మకం పెట్టుకుంది.

దశాబ్ది ఉత్సవాల వేళ తెలంగాణ ఆర్దిక శక్తి ఏంటో దేశం గుర్తిస్తోంది. ఆర్దికంగా బలంగా ఉన్న ఏ రాష్ట్రానికి తీసిపోకుండా పోటీ పడుతోంది. కేంద్రం నుంచి సహకారం లేకపోయినా స్వశక్తితో సత్తా చాటుతోంది. గత ఆర్దిక సంవత్సరంలో తెలంగాణ అంచనాలకు తగినట్లుగా రాబడి సాధించింది. గతఆర్దిక సంవత్సరంలో తొలి రెండు నెలల్లో రూ 20,238 కోట్లు రాబడిని సమకూర్చుకుంది. ఈ ఏడాది ఇదే కాలానికి రూ 31,700 కోట్ల మేర ఆదాయం సమకూర్చుకుంది. అందులో ప్రధానంగా వస్తు..పన్నుల ద్వారా రూ 7,430 కోట్లు సమకూరాయి. అమ్మకం పన్ను ద్వారా మరో రూ 2,358 కోట్లు వచ్చాయి.

Opinion: Telangana emerging as the strongest Financial State, providing inspiration to other State

తొలి రెండు నెలల కాలంలో ఎక్సైజ్‌ సుంకం రూపంలో రూ.2,683 కోట్లు, పన్నేతర రాబడి రూ.891 కోట్లు వచ్చింది. అమ్మకం పన్ను రూపంలో రూ.2,358 కోట్లు రాగా.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.2,358 కోట్లు ఆదాయం లభించింది. తెలంగాణకు కేంద్రం నుంచి ఏ మాత్రం ఆశించిన స్థాయిలో సహకారం దక్కటం లేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల ఆమోదంలోనూ ఇబ్బందులు సృష్టిస్తున్నది. కొర్రీలతో కాల యాపన చేస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాలోనూ కోతలు విధిస్తే..ఉద్దేశ పూర్వంగా అడ్డుకుంటోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపేణా రూ.41,001 కోట్లు వస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖ అంచనా వేసింది. కేంద్రం మాత్రం రూ.13,087 కోట్లే విడుదల చేసింది.

రాష్ట్రం పైన కేంద్రం వివక్ష మారటం లేదు. ప్రస్తత ఆర్దిక సంవత్సరంలో కేంద్రం నుంచి రాష్ట్రంకు ఎటువంటి అండ అందలేదు. మే నెలలో రూ 1,438 కోట్లు మాత్రమే విడుదల అందించింది. ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో రూ.41,259 కోట్లు వస్తుందని తెలంగాణ అధికారులు అంచనా వేసారు. కానీ, కేవలం మూడు శాతం మాత్రేమ అందాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల పైన ప్రేమ కురిపిస్తున్న కేంద్రం...తెలంగాణ పైన దురుద్దేశంతో వ్యవహరిస్తోంది. తెలంగాణ రాష్ట్రం దేశ ఆర్ధిక రంగానికి మద్దతుగా నిలుస్తున్నా..రాష్ట్రం పైన రాజకీయ కక్ష్య సాధింపులతో కేంద్రం వివక్ష కొనసాగిస్తోంది. అయినా..సొంత బలంతో ఎదుగుతూ రాష్ట్రం బలమైన రాష్ట్రాలకు పోటీ ఇస్తూ..తెలంగాణ మోడల్ పాలన ఏంటో నిరూపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+