అరుదైన రికార్డులు టీఎస్‌పీఎస్సీ సొంతం - జరిగిందేంటి..!?

టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో ఏం జరిగింది..ఏం జరుగుతోంది.

టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో ఏం జరిగింది..ఏం జరుగుతోంది. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు తెస్తోంది. దీని పైన ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. నిందితులను తేల్చే ప్రక్రియ ప్రారంభించింది. అటు సందేహాలు వ్యక్తం అవుతన్న పరిస్థితుల్లో పరీక్షలను రద్దు చేసారు. తిరిగి పరీక్షలకు సిద్దం అయ్యేందుకు అభ్యర్ధులకు స్టడీ మెటీరియల్ తో పాటుగా ఇతర సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో త్వరలోనే మరింత పకడ్బంధీగా పక్కా ప్రణాళికా బద్దంగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

టీఎస్‌పీఎస్సీకి ప్రత్యేక గుర్తింపు

టీఎస్‌పీఎస్సీకి ప్రత్యేక గుర్తింపు

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయం నుంచి టీఎస్‌పీఎస్సీ దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన సర్వీస్ కమిషన్ గా గుర్తింపు పొందింది. శంలోనే అత్యుత్తమ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లలో ఒకటిగా గుర్తింపు టీఎస్ పీఎస్సీ గుర్తింపు సాధించింది. టీఎస్ పీఎస్సీ ద్వారా ఒకే సారి 10 లక్షల మందికి పరీక్ష నిర్వహించిన ఘనత దక్కించుకుంది. 28 రాష్ట్రాల్లో ఎక్కడా జరగని విధంగా.. ఏడు భాషల్లో ఒకేసారి పరీక్షలు నిర్వహించిన రికార్డు కూడా ఉంది. పబ్లిక్ సర్వీసు కమిషన్ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదు. ఇప్పుడు తాజా వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులు చేసిన తప్పు కారణంగా మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వచ్చింది. ప్రభుత్వం పరీక్షల నిర్వహణ..ఉద్యోగాల కల్పనలో ప్రస్తుత పరిణామాలతో అభ్యర్ధుల్లో మరింత అనుమానాలకు తావు లేకుండా పాదర్శకంగా వ్యవహరించేందుకు ఆ పరీక్షలను రద్దు చేసింది. కొత్తగా మరోసారి పరీక్షల నిర్వహణకు సిద్దమవుతోంది.

పారదర్శక విచారణ.. కీలక నిర్ణయాలు

పారదర్శక విచారణ.. కీలక నిర్ణయాలు

ఇదే సమయంలో ఈ మొత్తం వ్యవహారం పైన ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సీనియర్ పోలీసు అధికారి దీనిని లీడ్ చేస్తున్నారు. కీలక నిందితులుగా ఉన్న ఇద్దరు ఉద్యోగులు ప్రవీణ్ తో పాటుగా రాజశేఖర్ రెడ్డి..వారితో ఈ కుట్రలో భాగస్వాములుగా ఉన్నవారిని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎవరున్న కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది. సర్వీసు కమిషన్ మాజీ ఛైర్మన్..పలువురు మేధావులతో తీసుకోవాల్సిన చర్యల పైన చర్చించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ లో ఏటువంటి లోపాలు లేవని తేల్చింది. పరీక్షలు రాసి క్వాలిఫై అయిన వారికి తిరిగి పరీక్షలు రాయాలంటే ఉండే బాధను తాము అర్దం చేసుకోగలమని మంత్రి కేటీఆర్ ఇప్పటికే వివరించారు. పరీక్షకు తిరిగి హాజరయ్యే అభ్యర్దులు తిరిగి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని..మెటీరియల్ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అదే సమయంలో రాజకీయంగా చేస్తున్న ఆరోపణలను మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు.

ప్రభుత్వం ఏం చెబుతోంది

ప్రభుత్వం ఏం చెబుతోంది


తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ లో పలు సంస్కరణలు అమలు చేస్తున్నారు. ఇంటర్వ్యూలతో జరుగుతున్న అన్యాయాలకు చెక్‌పెట్టేందుకు అన్ని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను రద్దుచేసింది. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చట్టంలో మార్పులు చేసింది. బోర్డు నియామకాలతో పాటుగా నిర్వహణలోనూ పారదర్శకంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు జరిగిన పరిణామాలకు రాజకీయ రంగు అంటింది. ప్రభుత్వం పైన రాజకీయ విమర్శల్లో భాగంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అభ్యర్ధుల్లో కొత్త అనుమానాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ వ్యవహారంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉందని.. యువత మనోభావాలతో ముడి పడి ఉన్న అంశాలతో రాజకీయాలు వద్దని ప్రభుత్వం కోరుతోంది. దీని పైన విచారణ తరువాత మరిన్ని వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+