తెలంగాణలో వైయస్ షర్మిలా కొత్త పార్టీ పెట్టాలని డిమాండ్ చేస్తున్న ఉస్మానియా విద్యార్థులు
హైదరాబాద్ : తెలంగాణలో వైయస్ షర్మిలా కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ పార్టీ జెండా అజెండాలు కూడా ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. అయితే తెలంగాణ ఏపీ రాష్ట్రాల సీఎంల కేసీఆర్-జగన్ మధ్య మంచి సఖ్యత ఉండటంతో ఇది సాధ్యమైన పనేనా అనే మరోవాదన కూడా ఉంది. అయితే ఒకవేళ షర్మిలా పార్టీ పెడితే ఏమేరకు సక్సెస్ అవుతారు..? తెలంగాణలో వైయస్ రాజశేఖర రెడ్డికి, వైయస్ కుటుంబానికి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. అంతేకాదు తెలంగాణలో వైసీపీకి ఫర్వాలేదనిపించేంతగా క్యాడర్ కూడా ఉంది.
Recommended Video

ఇక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు... ఇప్పుడు అదే రాష్ట్రంలో వైయస్ షర్మిలా కొత్త పార్టీ పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు... షర్మిలా ఎందుకు పార్టీ పెట్టాలని కోరుకుంటున్నారు... అనే విషయాలపై మా ప్రతినిధి హరికృష్ణతో ఫేస్ టూ ఫేస్.

నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని కానీ ఈ మూడింటినే ప్రస్తుత పాలకులు మరిచారని విద్యార్థులు దుయ్యబట్టారు. అయితే శర్మిలా రాజకీయ పార్టీ పెట్టి అధికారంలోకి వస్తే ఏపీలో ఎలాగైతే సంక్షేమ ఫథకాలను సీఎం జగన్ అందిస్తున్నారో... ఉద్యోగ ప్రకటనలు ఎలా అయితే ఇచ్చారో అలానే తెలంగాణలో కూడా సంక్షేప పథకాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications