వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థర్డ్ ఫ్రంట్‌కు ఓవైసీ సై: కేసీఆర్‌తో రెడీ, కాంగ్రెసు -బిజెపిలపై ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బిజెపి, కాంగ్రెసు పార్టీలతో దేశం విసిగిపోయి ఉందని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. తృతీయ ప్రత్యామ్నాయానికి ఇదే తగిన సమయమని ఆయన అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఉమ్మడి వేదిక ఏర్పాటుకు భావసారూప్యం కలిగిన ప్రముఖ రాజకీయ నేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శనివారం ప్రకటన చేసిన నేపథ్యంలో ఓవైసీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Asaduddin Owaisi

కెసిఆర్‌ను స్వాగతిస్తున్నా..

తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటనతో తాను ఏకీభవిస్తున్నట్లు ఓవైసీ చెప్పారు. దేశం బిజెపి పరిపాలనతో, కాంగ్రెసుతో విసిగిపోయారని కెసిఆర్ సరిగానే చెప్పారని ఆయన అన్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలనన ఆయన ప్రశంసించారు.

గత నాలుగేళ్లలో

గత నాలుగేళ్లలో కేసీఆర్ రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలనను అందించారని ఓవైసీ చెప్పారు. బిజెపి, పిడిపి కూటమి ఉగ్రవాద దాడులను అరికట్టడంలో విఫలమైందని ఓవైసి గన నెలలో విమర్శించారు. జాతీయవాది, జాతీయవ్యతిరేకి అనే ముద్రలు వేయడానికి మతం ప్రాతిపదిక కాకూడదని అన్నారు.

వారికి జైలు శిక్ష వేయాలి

బారత ముస్లింలను పాకిస్తానీలు అని పిలిచేవారికి జైలు శిక్ష విధించాలని ఆయన అన్నారు. అటువంటి ప్రకటనలు చేసేవారికి కనీసం3 జైలు శిక్ష వేయాలని అన్నారు. జాతీయ రాజకీయల్లో పాల్గొంటానని కేసిఆర్ శనివారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఓవైసీ కేసీఆర్‌కు ఆదివారంనాడు మద్దతు ప్రకటించారు.

English summary
The country is fed up with the BJP and the Congress, and it's time to go for a third front, AIMIM Chief Asaduddin Owaisi said on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X