వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధరణి వల్ల యజమానులు భూహక్కులను కోల్పోయారు.!కేసీఆర్ విచిత్ర క్రీడకు తెర తీసారన్న భట్టి.!

|
Google Oneindia TeluguNews

ఖమ్మం/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రెవెన్యూ రికార్డు నమోదులో జరిగిన అవకతవకల వల్ల అసలైన రైతులు భూమిపై హక్కులు కోల్పోయారని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేసారు. ధరణి పోర్టల్ రద్దు చేసి, భూ సంబంధిత రైతుల సమస్యలను పరిష్కారించాలని టిపిసిసి పిలుపు మేరకు సోమవారం ఖమ్మం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యాక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ధర్నాకు హాజరైన రైతులను, కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి భట్టి మాట్లాడారు.

 ధరణితో హక్కులు కోల్పోయిన రైతులు..ఖమ్మం కలెక్టరేట్ వద్ద భట్టి ధర్నా

ధరణితో హక్కులు కోల్పోయిన రైతులు..ఖమ్మం కలెక్టరేట్ వద్ద భట్టి ధర్నా


గత ప్రభుత్వాలు రాష్ట్రంలో 24లక్షల ఎకరాలను పంపిణీ చేయగా, ఇప్పటి ప్రభుత్వం 12లక్షల ఎకరాలను పార్ట్-బిలో నమోదు చేయడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. రెవెన్యూ రికార్డులను ధరణి పోర్టల్లో నమోదు చేస్తున్న క్రమంలో జరిగిన పొరపాట్లకు రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులు పెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. భూసేకరణ చేసిన సర్వే నెంబర్లో భూమి మొత్తాన్ని ప్రోహిబిటెడ్ లిస్టులో చేర్చడం వల్ల భూమి ఉన్న రైతులు ధరణిలోకి ఎక్కించుకోవడానికి వ్యయ, ప్రయాసాలు పడాల్సి వస్తుందన్నారు. పార్టు-ఎలో అధికారులు తప్పుగా నమోదు చేసిన పట్టాదారు ఇంటి పేరు, తండ్రి పేరు, సర్వే నెంబర్, విస్తీర్ణం తదితర పొరపాట్లకు కుడా రైతులను ఇబ్బందులు పెట్టడమేంటని ప్రశ్నించారు భట్టి విక్రమార్క.

 ఇచ్చిన భూములు గుంజుకోవడం ఆన్యాయం.. పేదల పక్షాన గొంతు విప్పిన కాంగ్రెస్

ఇచ్చిన భూములు గుంజుకోవడం ఆన్యాయం.. పేదల పక్షాన గొంతు విప్పిన కాంగ్రెస్


పొరపాట్లు చేసిన అధికారులు రికార్డులను సరిచేయకుండ రైతులను ఇబ్బంది పెట్టడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. అధికారంలోకి వస్తే 3 ఎకరాలు భూమి పంపిణీ చేస్తామని వాగ్ధనాం చేసిన టిఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను అభివృద్ది పేరిట గుంజుకోవడం ఆన్యాయమన్నారు. టిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 సంవత్సరాల్లో భూ పంపిణీ జరుగలేదన్నారు. ప్రభుత్వ భూములను పంపిణీ చేయడానికి గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆసైన్ కమిటీలను రద్దు చేసి భూ పంపిణీ గురించి 8 ఏండ్లుగా ఊసే ఎత్తడం లేదన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు గత ప్రభుత్వాలు భూములు కొనుగోలు చేసి ఇందిరమ్మ పథకంలో ఇండ్లు కట్టించాయన్నారు భట్టి.

 భూ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోలన.. టీ సర్కార్ ను హెచ్చరించిన సీఎల్పీ నేత..

భూ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోలన.. టీ సర్కార్ ను హెచ్చరించిన సీఎల్పీ నేత..


రెండు మార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు పట్టాలు ఇవ్వడానికి భూ సేకరణ చేయడం లేదన్నారు. కాంగ్రెస్ హాయంలో పేదలకు పంపిణీ చేసిన ఆసైన్డ్, ఇనాం, సర్కార్, భూములను అభివృద్ధి అవసరాల పేరిట బలవంతంగా గుంజుకొని టిఆర్ఎస్ సర్కార్ పేదలను మరింత పేదలుగా మార్చుతున్నదని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం జమబంధీ నిర్వహించేవన్నారు. టిఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో జమబంధీ రికార్డుల నమోదు సక్రమంగా జరుగని కారణంగా అనేక భూ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని వివరించారు. ధరణిలో ఉన్న అవకతవకలను సరిచేసి రైతుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేశారు భట్టి.

 కలెక్టరేట్ ధర్న చౌక్ వరకు ర్యాలీ.. కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన భట్టి

కలెక్టరేట్ ధర్న చౌక్ వరకు ర్యాలీ.. కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన భట్టి


రాష్ట్రంలో భూ పంపిణీ కార్యాక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలన్నారు సీఎల్పీ నేత. రాష్ట్రంలో ఇండ్లు లేని నిరుపేదల ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం భూములు కొనుగోలు చేసి పట్టాలు ఇవ్వాలన్నారు. ఆసైన్డ్, ఇనాం భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులను లబ్ధిదారులుగా గుర్తించి వెంటనే పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. భూ సంబంధిత రైతుల సమస్యలను పరిష్కరించని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోలన కార్యాక్రమాలు చేస్తామని హెచ్చరించారు. అయినప్పటికి సర్కార్ మొండిగా వ్యవహరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు సమస్యలను అన్నింటిని పరిష్కరిస్తుందన్నారు భట్టి విక్రమార్క.

English summary
CLP leader Bhatti Vikramarka expressed his anger that due to the irregularities in the Dharani portal revenue record brought by the state government, the original farmers have lost their rights to the land and the government should be responsible for this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X