ఎవరడ్డొచ్చినా పాలమూరు ఆగదు: కెసిఆర్(పిక్చర్స్)

మహబూబ్‌నగర్: వచ్చే నాలుగేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి కృష్ణా జలాలతో మహబూబ్‌నగర్‌ జిల్లా రైతుల పాదాలు కడుగుతానని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కరివెనవద్ద గుట్టపై గెస్ట్‌హౌస్ కట్టుకుని 15రోజులకోసారి వచ్చి పథకం పనులు స్వయంగా పరిశీలిస్తానని అన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెనలో గురువారం పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైలాన్‌ను సిఎం కెసిఆర్ ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలమూరు బాధలు ఎవరూ పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి పథకం చేపట్టిందని కేసీఆర్ అన్నారు.

తెలంగాణ ఉద్యమం ప్రారంభించగానే ఆలంపూర్ జోగులాంబకు మొక్కుకుని ఆర్డీఎస్ వరకు పాదయాత్ర చేశానని కేసీఆర్ గుర్తు చేశారు. ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకునే అదృష్టం అందరికీ దక్కదు కానీ ఆ అవకాశం తనకు దక్కిందని అన్నారు. ఇన్నాళ్లూ ఆర్డీఎస్ ఆగమైంది.. నెట్టెంపాడు ముందుకుపోలేదు..భీమా గురించి భగవంతునికి కూడా తెలియని పరిస్థితి ఉండేదని అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

వచ్చే నాలుగేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి కృష్ణా జలాలతో మహబూబ్‌నగర్‌ జిల్లా రైతుల పాదాలు కడుగుతానని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

కెసిఆర్

కెసిఆర్

కరివెనవద్ద గుట్టపై గెస్ట్‌హౌస్ కట్టుకుని 15రోజులకోసారి వచ్చి పథకం పనులు స్వయంగా పరిశీలిస్తానని అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెనలో గురువారం పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైలాన్‌ను సిఎం కెసిఆర్ ఆవిష్కరించారు.

కెసిఆర్

కెసిఆర్

అనంతరం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.

కెసిఆర్

కెసిఆర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలమూరు బాధలు ఎవరూ పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి పథకం చేపట్టిందని కేసీఆర్ అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ ఉద్యమం ప్రారంభించగానే ఆలంపూర్ జోగులాంబకు మొక్కుకుని ఆర్డీఎస్ వరకు పాదయాత్ర చేశానని కేసీఆర్ గుర్తు చేశారు.

కెసిఆర్

కెసిఆర్

ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకునే అదృష్టం అందరికీ దక్కదు కానీ ఆ అవకాశం తనకు దక్కిందని అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

ఇన్నాళ్లూ ఆర్డీఎస్ ఆగమైంది.. నెట్టెంపాడు ముందుకుపోలేదు..భీమా గురించి భగవంతునికి కూడా తెలియని పరిస్థితి ఉండేదని అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

రంగారెడ్డిలో కరువు కోరల్లో చిక్కితే.. హైదరాబాద్‌లో నీటికోసం ఇబ్బందులు పడ్డామని వివరించారు. ఇకపై ఈ గోస ఉండదని అన్నారు. రూ.35,200 కోట్లతో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని తెలిపారు.

రంగారెడ్డిలో కరువు కోరల్లో చిక్కితే.. హైదరాబాద్‌లో నీటికోసం ఇబ్బందులు పడ్డామని వివరించారు. ఇకపై ఈ గోస ఉండదని అన్నారు. రూ.35,200 కోట్లతో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని తెలిపారు. ఈ పథకాన్ని రూపొందించేందుకు ఓఎస్డీ రంగారెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి, ఈఎంసీ మురళీధర్‌రెడ్డిలతో కలిసి నెలల తరబడి కష్టపడ్డామని చెప్పారు.

కరివెన రిజర్వాయర్ మూడో స్టేజీలో ఉందని ఇక్కడ రెండు రెండున్నర ఏండ్లలోనే 55 టీఎంసీల నీరు రప్పిస్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడిని ప్రస్తావిస్తూ ఆయనది లక్ష్మీపాదం.. ఎమ్మెల్యే అయిన ఏడాదికే నియోజకవర్గానికి 50 టీఎంసీల నీళ్లు తీసుకొస్తున్నాడని సీఎం ప్రశంసించారు.

ఈ పథకంలో నిర్వాసితులను సంపూర్ణంగా ఆదుకున్న తర్వాతే పనులు చేపడతామని సీఎం భరోసా ఇచ్చారు. ముంపునకు గురయ్యే మూడు గిరిజన తండాల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తామని, రూ. 5లక్షల 40వేల చొప్పన వ్యయం చేసి డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. భూమి కావాలని వారు కోరుకుంటే ఎన్ని లక్షలు ఖర్చు చేసి అయినా భూములు కొనుగోలు చేసి ఇస్తామని భరోసా ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+