Palamuru-Rangareddy: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ మోటర్ బంద్ అయింది..! ఎందుకంటే..!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ను నిర్మించారు. ఈ ప్రాజెక్టును మొన్న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఒక మోటర్ స్విచ్ఆన్ చేశాడు. నీళ్లు కొల్లాపూర్ పొలిమేరలు దాటారో లేదో అలా పంప్ బంద్ అయింది. ప్రాజెక్టు పనులు 40 శాతం పెండింగ్ ఉండగానే ఎలా ప్రారంభిస్తారని, ఇది కేవలం ఎన్నికల జిమ్మిక్కేనని ప్రతిపక్షాలు ఆరోపించినట్లే పాలమూరు షో కాస్తా ఒక్కరోజు మురిపెమే అయినట్లు వార్తలు వస్తున్నాయి.
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ కింద నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉంది. ఇందులో ఏదుల రిజర్వాయర్ తప్ప మిగతావి పూర్తి కాలేదు. మొదటి ప్యాకేజీ కింద నిర్మిస్తున్న నార్లాపూర్ రిజర్వాయర్ పనులు కూడా 30శాతం పెండింగ్ లోనే ఉన్నాయని తెలుస్తోంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీటిని ఎత్తిపోయాల్సిన నార్లాపూర్ పంప్ హౌస్ లోని తొమ్మిది మోటార్లలో ఒక్కటి మాత్రమే సిద్ధమైనట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఆ ఒక్క మోటారునే ఈ 16న సీఎం స్విచ్ఆన్ చేశారని చెబుతున్నారు. మోటార్ ఆన్ చేయగానే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్లాపూర్ రిజర్వాయర్ లోకి నీళ్లు వెళ్లాయని అధికారులు తెలిపారు. 6.42 టీంఎసీల కెపాసిటీ ఉన్న నార్లాపూర్ రిజర్వాయర్ లో 2 టీఎంసీల దాకా నీళ్లు నింపుతామని చెప్పారు. కానీ, మధ్యలో మెయిన్ కెనాల్ పనులు పెండింగ్ లో ఉండడంతో ఇది సాధ్యం కానట్లు తెలుస్తోంది. ఏదుల నుంచి వట్టెం మెయిన్ కెనాల్, వట్టెం రిజర్వాయర్, పంప్‌హౌజ్, కర్వెన మెయిన్ కెనాల్ పనులూ అసంపూర్తిగా ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ బలహీపడుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అందుకే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభించిన చెప్పారని వివరించారు. ప్రారంభించిన కొద్ది రోజులకే మోటర్లు బంద్ చేశారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రజల్ని మభ్యపెడుతుందని ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications