వదిలేది లేదు, ట్యాపింగ్‌తో కూలుతారు: కేసీఆర్‌పై పల్లె
విజయవాడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ పైన, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన కుట్ర చేస్తోందని, దీనిపై తాము ఎట్టి పరిస్థితుల్లో తగ్గే ప్రసక్తి లేదని ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సోమవారం విజయవాడలో అన్నారు.
దీనిని తాము గవర్నర్, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు. ఇది ఐదు కోట్ల మంది ఏపీ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమన్నారు. దీనిపై ఏపీ కేబినెట్ సమావేశమై చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
గవర్నర్‌కు, కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అవసరమైతే రాష్ట్రపతి వద్దకు వెళ్తామన్నారు. ఇది కచ్చితంగా కుట్రనే అన్నారు.
కేసీఆర్ అభధ్రతాభావంలో ఉన్నారని చెప్పారు. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనే భయం కేసీఆర్‌లో ఉందని, అందుకే ఇలా కుట్ర చేస్తున్నారన్నారు.
రేవంత్ రెడ్డి వ్యవహారంపై మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఈసీ కోడ్ ఉన్నప్పుడు ఈసీ కేసు పెట్టాలని, కానీ అలా జరగలేదని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే ప్రభుత్వం కుప్పకూలిన సందర్భాలు ఉన్నాయన్నారు. ట్యాపింగ్ మహా నేరం అన్నారు.
తాము లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నామని, భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి వస్తామనే కుట్ర చేస్తోందన్నారు. దీనిపై తాము ఎట్టి పరిస్థితుల్లో తగ్గే ప్రసక్తి లేదన్నారు. చంద్రబాబును అదుపులోకి తీసుకునే దమ్ము ఎవరికీ లేదన్నారు.
ఏపీ కేబినెట్ ముందుకు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం ముందుకు జరిగింది. ఈ నెల 16న జరగాల్సి ఉండె. కానీ కేబినెట్ భేటీ మంగళవారం జరగనుంది. ఇందులో రేవంత్ ఇష్యూ, చంద్రబాబువిగా భావిస్తున్న ఆడియో సంభాషణలపై చర్చ జరగనుంది. కేంద్రంకు దీనిపై ఫిర్యాదు చేసే అంశంపై చర్చిస్తారు. అనంతరం బాబు సాయంత్రం ఢిల్లీకి బయల్దేరుతారు.

బాబు రాజీనామా చేయాలి: సీఆర్
చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని సీ రామచంద్రయ్య అన్నారు. దీనిని రాష్ట్రాల మధ్య గొడవగా చూపించవద్దన్నారు.
సీఎం క్యాంప్ కార్యాలయం ప్రారంభం
విజయవాడలో ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయం ప్రారంభమైంది. ఏపీ కార్యకలాపాల నిర్వహణ కోసం విజయవాడలో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. ఇక నుంచి వారానికి మూడు రోజులు, అవసరమైతే ఐదు రోజుల పాటు క్యాంపు కార్యాలయంనే చంద్రబాబు ఉండనున్నారు.












Click it and Unblock the Notifications