సీనియర్లే క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారంటూ పాల్వాయి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కొందరు క్రమశిక్షణను పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై నాయకత్వం చర్యలు తీసుకోవాలన

హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కొందరు క్రమశిక్షణను పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు.పార్టీ నాయకులు హద్దులు దాటుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

గాందీభవన్ లోని టిపిసిసి కార్యాలయంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్వాయి గోవర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ తెలంగాణ వ్యవహరాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ మేరకు పాల్యాయి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్టీ సీనియర్లు కొందరు క్రమశిక్షణను పాటించడం లేదని ఆయన ఆరోపించారు. హద్దులు దాటుతున్నారని వారిపైస చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకుడు ఎకె ఆంటోనిని కూడ కోరిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

palvai govardhan reddy sensational statements on congress leaders

నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు గీత దాటి వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పారు.కొందరు పార్టీ నాయకులు క్రమశిక్షణను దాటిన వారిని ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ క్రమశిక్షణను విస్మరిస్తున్న నాయకులను దిగ్విజయ్ సింగే కట్టడి చేయాలని ఆయన కోరారు.

అయితే ఈ సమావేశానికి ఏడుగురు సభ్యులు డుమ్మా కొట్టారు. రాపోలు ఆనంద బాస్కర్, ఎంఏ ఖాన్, జైపాల్ ెడ్డి, దామోదర్ రెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, పొడెం వీరయ్య లు సమావేశానికి గైరాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+