ఓటర్ మూడ్ క్లియర్, ఎవరి లెక్కలేంటి - తేలిపోయిందా..!!

తెలంగాణలో గెలిచేదెవరు. మరో మూడు గంటల్లో పోలింగ్ ముగియనుంది. హైదరాబాద్ మినహా తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ శాతం క్రమేణా పెరుగుతోంది. మెదక్ జిల్లాలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. ఇక, ఉదయం నుంచి పోలింగ్ సరళి పైనా పార్టీలు అంచనాలకు వచ్చాయి. ఓటర్లు ఎవరికి పట్టం కడుతున్నారనేది దాదాపు క్లారిటీ వచ్చింది. ఇదే సమయంలో చివరి మూడు గంటల పోలింగ్ తమకు అనకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందు కోసం మైండ్ గేమ్ ప్రారంభించాయి.

పెరుగుతున్న పోలింగ్: తెలంగాణలో పోలింగ్ కొనసాగుతోంది. క్రమేణా పోలింగ్ శాతం పెరుగుతోంది. జిల్లాల వారీగా పోలింగ్ లెక్కలను వెల్లడించారు. దీంతో, ఇప్పుడు పార్టీల్లో మరింత ఉత్కంఠ పెరుగుతోంది. పోలింగ్ శాతం..ఓటింగ్ సరళి పైన పార్టీలు ఫోకస్ చేసాయి. దీంతో..ఇప్పుడు మిగిలిన నాలుగ గంటల పోలింగ్ పైన పార్టీలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి.

Parties applying mind game over polling time to attract voters in Social media

కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ గెలుపు పైన ధీమాగా ఉన్నాయి. పోలింగ్ సరళి పైన ఇప్పటికే పార్టీలకు స్పష్టత వచ్చింది. ఈ సమయంలో గెలుపుపైన అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్ధి పార్టీలను టార్గెట్ చేస్తున్నాయి. ఎన్నికల ముందు వరకు గెలుపు ఖాయం అని ప్రచారం చేసుకున్న పార్టీ దిగాలు పడిందంటూ మరో పార్టీ పోస్టింగ్స్ పెడుతోంది.

పార్టీల తుది ప్రయత్నాలు: ఇదే సమయంలో తమ పార్టీ టాప్ గేర్ లో ఉన్నట్లుగా తెలంగాణ వ్యాప్తంగా నివేదికలు వస్తున్నాయని మరో ముఖ్య నేత పోస్ట్ చేసారు. అయితే, ఎన్నికల సంబందనలు ఉల్లంఘించేలా ఉదయం నుంచి పార్టీల ప్రధాన నేతలు ప్రకటనలు చేస్తున్నారు. కానీ, క్షేత్ర స్థాయిలో మాత్రం ఓటరు తన పని తాను చేసుకు పోతున్నాడు.

తాను డిసైడ్ అయిన పార్టీకే ఓటు వేస్తున్నారు. ఇది ఇప్పటికే ప్రధాన పార్టీలకు క్లారిటీ వచ్చేసింది. ఎవరు గెలిచే అవకాశం ఉందనేది ఇప్పటికే దాదాపుగా అర్దమైంది. అయినా..మరో మూడు గంటలు పోలింగ్ కు సమయం ఉండటంతో ఏ అవకాశం మిస్ చేసుకోకూడదని పార్టీలు భావిస్తున్నాయి. దీంతో, చివరి ప్రయత్నాలను ముమ్మరం చేసాయి. ఫలితంగా సోషల్ మీడియా వేదికగా వార్ కొనసాగుతోంది.

Parties applying mind game over polling time to attract voters in Social media

ఓటరు నాడి సుస్పష్టం: ఇక..హైదరాబాద్ లో పోలింగ్ శాతం తగ్గటం ప్రధాన పార్టీలకు ఆందోళన కలిగిస్తోంది. పోలింగ్ సమయంలోనూ పార్టీలు ఒకరి పైన మరొకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నాయి. తమ పార్టీనే గెలుస్తుందంటూ ప్రకటనలు చేస్తున్నాయి. అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.

గ్రామీణ ప్రాంతంలో పోలింగ్ శాతం ఎక్కవగా ఉండగా.. అర్బన్ ఏరియాలో తక్కువగా నమోదు అవుతోంది. దీంతో..పోలింగ్ శాతం.. ఓటింగ్ సరళి తో ఎవరికి అనుకూలంగా ఫలితాలు ఉంటాయనేది ఇప్పటికే దాదాపు క్లారిటీ వస్తోంది. ఇక..ఈ సాయంత్రం పోలింగ్ పూర్తయిన తరువాత ఓటరు నాడి పైన పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+