వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా నుండి సీఎం కేసీఆర్ కోలుకోవాలని .. ఐసోలేషన్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రకటన , ట్వీట్ చేసిన చిరంజీవి

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి ఏ ఒక్కరినీ వదలడం లేదు . వీరు వారు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిని పట్టిపీడిస్తోంది కరోనా. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా మహమ్మారి బారిన పడి తన ఫాంహౌస్ లో డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ప్రస్తుతం కరోనా బారినపడ్డారు .తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా బారిన పడడంతో పలువురు రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఇప్పటికే ట్వీట్లు చేశారు.

తెలంగాణా రాష్ట్రంలో నేటి నుండి నైట్ కర్ఫ్యూ విధింపు .. కరోనా ఉధృతి దృష్ట్యా సర్కార్ కీలక నిర్ణయంతెలంగాణా రాష్ట్రంలో నేటి నుండి నైట్ కర్ఫ్యూ విధింపు .. కరోనా ఉధృతి దృష్ట్యా సర్కార్ కీలక నిర్ణయం

కేసీఆర్ ఎప్పట్లాగే ప్రజాసేవలో నిమగ్నం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నా : పవన్ కళ్యాణ్ ప్రకటన

తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన త్వరగా కోలుకుని ఎప్పట్లాగే ప్రజాసేవలో నిమగ్నం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కు కోవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నాయని ఎటువంటి ఇబ్బంది లేదని వైద్యులు చెప్పడం తెలంగాణ ప్రజలందరికీ ఊరటను కలిగిస్తోందన్నారు పవన్ కళ్యాణ్. అదే సమయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎయిమ్స్ లో చేరినట్లు సమాచారం అందిందని, ఆయన కూడా త్వరగా కోలుకోవాలని తాను దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

కరోనా చికిత్స తీసుకుంటూనే కేసీఆర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రకటన . చిరంజీవి ట్వీట్

ప్రస్తుత హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ కరోనా బాధితుడిగా కరోనా పై పోరాటం చేస్తూనే ,కరోనా బారిన పడిన కెసిఆర్ త్వరగా కోలుకోవాలని ప్రకటన విడుదల చేశారు.

సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ చిరంజీవి సైతం తన ఆకాంక్షను వ్యక్తం చేశారు . తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారు కరోనా వైరస్ బారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్న చిరంజీవి సీఎం కేసీఆర్ పట్ల తన అభిమానాన్ని వ్యక్తంచేశారు.

నిన్నటి నుండి కేసీఆర్ క్షేమం కోసం ప్రముఖుల ఆరాటం ..ట్వీట్ల వర్షం

నిన్నటి నుండి కేసీఆర్ క్షేమం కోసం ప్రముఖుల ఆరాటం ..ట్వీట్ల వర్షం

కరోనావైరస్ నుండి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు ట్వీట్ చేశారు. కోవిడ్ -19 నుండి కెసిఆర్ కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని పలువురు ట్వీట్ చేశారు . మెగాస్టార్ చిరంజీవి, నటుడు మహేష్ బాబు ,టిడిపి జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు, తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ మరియు ఇతర రాజకీయ నాయకులు కూడా కరోనావైరస్ నుండి కెసిఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

 తన ఫాంహౌస్లో ఐసోలేషన్ లో సీఎం కేసీఆర్

తన ఫాంహౌస్లో ఐసోలేషన్ లో సీఎం కేసీఆర్

ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఫాంహౌస్లో ఐసోలేషన్ లో ఉన్నారు . నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు వైద్య చికిత్సలు అందుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఏకంగా సీఎం కేసీఆర్ కరోనా మహమ్మారి బారిన పడడం ఒక వైపు , హైకోర్టు కూడా తెలంగాణ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడిన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించారు. కఠిన ఆంక్షల దిశగా తెలంగాణ సర్కార్ కరోనా కట్టడికి నిర్ణయాలు తీసుకుంటోంది.

English summary
Janasena chief Pawan Kalyan responded by releasing a statement saying that CM KCR should recover quickly. Pawan Kalyan said he was praying to God that he would recover quickly and engage in public service as usual. While Pawan Kalyan, who is currently undergoing treatment at Home Isolation, is battling corona as a corona victim, KCR, who has been affected by corona, has released a statement saying that he should recover quickly. Megastar Chiranjeevi also expressed his desire for CM KCR to recover quickly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X